సాహితి

శ్రీమంతుల యింటి గుట్టు - చెదిరిన సంసారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్ఫతీమా’ అందగత్తె. పనిలో చురుకు. అన్ని విధాలా దంపతులకి తలలో నాలికలా మెలిగేది. వాళ్ల ఇంట్లో నలుగురు పనిమనుషులు. వంట మనిషీ, గినె్నలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం లాంటి పనులకే ఒక మనిషి, బయట తోటమాలి! వీళ్లందరిమీద అజమాయిషీ ఫతీమా. ఇలాంటి ముఖ్యమైన పనిమనిషిని- అజమాయిషీ చేసే మనిషిని ఆ దంపతులు ఉద్యోగం నుంచి తీసేశారు.
సి.రామచంద్రరావు రాసిన ‘కంపెనీ లీడ్’ అనే కథలో పాత్రలు వాళ్ల ముగ్గురూ. అతి తక్కువ కథలు వ్రాసి, కథల ప్రపంచంలో ‘ట్రెండ్ సెట్టర్’లాంటి వ్యక్తిగా పేరుపొందిన రుూయన ముఖ్యమైన కథ ‘వేలు పిళ్ళై’ అనేది. కథలకు వాతావరణం కల్పించడం, ప్రతి చిన్న వివరానికీ తగినంత సమర్థన చూపించడం (అంటే ఇతివృత్తాన్ని సజావుగా నడిపించడం) ఈయన రచనలలో వ్యక్తం అవుతుంది. ఇంతకీ రుూ కథలో ఫతీమాను ఎందుకు ఉద్యోగం నుంచి తీసివేశారు? అదీ ముఖ్య విషయం. ఆ కారణంగానే కథ దుఃఖాంతంగా సుఖాంతం అవుతుంది.
దంపతులు రాజేష్, సునీత ఇద్దరూ పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగులు. రాజేష్‌ది స్వంత కంపెనీ అయితే, సునీతది మల్టీనేషనల్ కంపెనీ. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవటానికి ఇద్దరికీ అవకాశాలు వున్నాయి. కంపెనీ విషయాలలోనే కాక, కుటుంబ విషయాలలో కూడా రుూ అవకాశమే నిలుపుకున్నారు. ‘‘్ఫతీమాకి రాజేష్‌కి మధ్య శరీర సంబంధం దాదాపు పదేళ్ళుగా సాగుతోందన్న విషయం మూడు నెలల క్రితం బయటపడింది. సునీత పెద్ద రాద్ధాంతం చేసి తన తల్లిదండ్రులూ, రాజేష్ తల్లిదండ్రులూ మాత్రమే కాకుండా, కొందరు దగ్గర బంధువులూ, మిత్రులు కూడా దాంట్లో తలదూర్చవలసిన పరిస్థితి తీసుకువచ్చింది. ఫతీమాని ఉద్యోగంలోంచి తీసివేయడంతో సమస్య తేలికై ఎగిరిపోయింది. ఊహ లేనంత తొందరగా భార్యాభర్తలు ముందులాగే మసలుకోవడం మొదలుపెట్టారు. కథ ఇంతటితో ఆగిపోతే మంచిదే, అయితే ఇప్పటితోనే ప్రారంభం అవుతుంది.
సునీతకు బంజారాహిల్స్‌లో పదిహేను వందల గజాల స్థలం తండ్రి ఇచ్చాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. దివ్య భవనంలా అన్ని హంగామాలతో తయారైన ఆ ఇంటిని ‘కంపెనీ’కి ‘లీజ్’కు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. వ్యక్తులకంటే, కంపెనీకి ఇస్తేనే భద్రత ఎక్కువ వుంటుందని వాళ్ల అభిప్రాయం. ‘లీజ్’ షరతులు పత్రికా ప్రకటన చేసి ఆఫర్లు పంపమని కోరారు. రకరకాల ఆఫర్లు వచ్చాయి. వాటిని ‘టేబులేట్’ చేసి నిర్ణయించే పని రాజేష్‌కే అప్పజెప్పింది ఆమె. ఎందుకంటే, తన ఆఫీసులో కింది ఉద్యోగస్తులను స్వంత పనులకోసం ఉపయోగించడం నిషిద్ధం. రాజేష్‌కు అటువంటి సౌకర్యం వుంది, సర్వ స్వతంత్రుడు గనుక.
ఈ ప్రయత్నం యిలా జరుగుతూ వుండగా సునీత ఒక రోజు ఫతీమాను పంజాగుట్టలో పనికోసం ఎదురుచూసే స్థలంలో చూస్తుంది. ఫతీమాకు వారానికి మూడు నాలుగు రోజులు మాత్రమే పని దొరుకుతూందట. ‘మనింట్లోంచి తీసేశామని హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెప్పాను. అంచేత కంపెనీ నుంచి కూడా తీసేసి ఉండచ్చు’ అంటాడు రాజేష్ తనకు రుూ విషయం ఏమీ తెలియనట్లు, సంబంధం లేనట్లూను. సునీత అతని మాటలకు చక్కగా రెస్పాండ్ అవుతుంది. ‘ఇది అమానుషం. ఇక్కడ పని మానిపించేస్తే, కంపెనీలో యింకొక పని ఇవ్వలేరా? మీ హెచ్.ఆర్ డిపార్ట్‌మెంట్‌ను గట్టిగా అడుగు. నేను నీతో మాట్లాడుతానని ఫతీమాకు ధైర్యం చెప్పాను’ అంటుంది.
కంపెనీ లీజ్, షార్ట్‌లిస్ట్ వాళ్ల ముందు చర్చ జరుగుతూ వుండగా, సునీత ‘చెప్పడం మరిచిపోయాను. ఈ రోజు ఫతీమాని మళ్లీ చూచాను. పని దొరకలేదు. దిగాలుపడి కూర్చుంది. నే వెళ్లి మాట్లాడాను. తిండిమాట దేవుడెరుగు. రోజూ మొగుడు చావబాదుతున్నాడట. కూలీ లేని రోజున మరీని. ఇరుగుపొరుగు వాళ్లు అడ్డొస్తే తనకి నీతో ముందున్న సంబంధాన్ని పైకి తీసి వాళ్ల నోళ్లు మూయిస్తున్నాడట’ అని చెబుతుంది. రాజేష్ అప్పుడు చెబుతాడు, ఆ భర్తకు రుూ సంబంధాన్ని గురించి చాలాకాలం ముందే తెలుసుననీ, యిది ఆధారంగా రాజేష్ దగ్గర తరుచుగా డబ్బు దండుకునేవాడనీ, ఫతీమాకి తానే యిల్లు కట్టించాననీ! సునీత గంభీరంగా ‘ఇదంతా పాత కథ. ఇప్పుడు ఫతీమా చాలా దీనావస్థలో వుంది. నువ్వు సాయం చెయ్యాలి. మీ కంపెనీలో ఊడదీసిన పని మళ్లీ యిప్పించు’ అంటుంది. అది కంపెనీ రూల్స్‌కు వ్యతిరేకం అని రాజేష్ సమర్థించుకుంటాడు. తరువాత భార్యాభర్తలమధ్య చురుకయిన సంభాషణ జరుగుతుంది.
ఆ మరుసటి రోజు సునీత రుూ ప్రసక్తి మళ్లీ తీసుకువచ్చి, తానే రాజేష్ కంపెనీ హెచ్‌ఆర్ మానేజర్ అగర్వాల్‌తో మాట్లాడాననీ, రాజేష్ తీసివేయమంటేనే ఫతీమాను కంపెనీ ఉద్యోగం నుంచి తీసివేయడం జరిగిందనీ తను తెలుసుకున్నట్లుగా చెప్పేస్తుంది. అప్పుడు రాజేష్ తను మళ్లీ అగర్వాల్‌తో మాట్లాడి ఫతీమాకు ఉద్యోగం తిరిగి ఇప్పిస్తానని చెబుతాడు. సునీత ‘నీకా శ్రమ అక్కర్లేదు’ అని ఫతీమాను తాను స్వయంగా వెళ్లి తీసుకువచ్చాననీ, కంపెనీ లీజ్ ఇవ్వవలసిన అవసరం లేదనీ, తాను ఫతీమాతోపాటు ఆ కొత్త ఇంటికి రావటానికి ఒప్పుకున్నదనీ చెప్పి కథను అంతం చేస్తుంది.
ఇంతకూ, సునీతకు భర్తతో వ్యతిరేకించటానికి- యిల్లు మారిపోవటానికి కారణం ఏమిటో రచయిత తన మాటలలోగాని, పాత్రల మాటలలోగానీ చెప్పరు. పాఠకుల ఊహకే వదిలేస్తారు. సునీత భర్త తాలూకు వివాహేతర సంబంధాన్ని ప్రయత్న పూర్వకంగా సహించగలిగింది గాని, భర్త తనతో అబద్ధం ఆడడం మటుకు ఓర్చుకోలేకపోయింది. భర్తవల్ల అన్యాయం జరిగింది ఫతీమాకు. ఆ ఫతీమాను తాను రక్షించడమే యుక్తం అని నిర్ణయించుకుంది. కథను యుక్తియుక్తంగా నడిపించిన పద్ధతి కొత్తదనాన్ని తీసుకువస్తుంది.

- శ్రీవిరించి, 09444963584