సాహితి

రా మిత్రమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిత్రమా!
కునే్నలోని పురుగు
పాకుతూనో దొర్లుతూనో
లక్ష్యంవైపు వెళ్తుందే కానీ

రాబందుల పొట్టల్లో బ్రతికే
నట్టలకు సోయని పుట్టించలేదు

కీటకం లద్దిని తిని
నేలను శుద్ధి చేస్తుందే కానీ

పచ్చని గరిక తిని లద్దిని
విసర్జించే గార్ద్భానికి
ఆదర్శం కాజాలదు

అయనా మిత్రమా
ఊడిగాలకు తెగబడ్డ ప్రాణులను
అక్షరాలు ఏనాడో వెలివేశాయ

ఆశల దోసిల్లు చాచి
అంజలి ఘటించే విగ్రహాలకు
సిరా సౌరభం ఏం ఖర్మ
కన్నతల్లి పురిటి నెత్తురు కూడా దుర్గంధమై వెక్కిరిస్తోంది

మిత్రమా!
విరాట్టుల పల్లకీ మోసే నీ వంటి బోయాలకు
వెనె్నముక కావాలి కానీ
కాలానికి సదా ఎదురీదే కీటకాలకు ఎందుకు?

నువ్వు అందలమెక్కిన చందమామవు అనుకుంటున్నావేమో కాదు కాదు
కాలం మరణించిన చోట నిలుచున్నావ్
తుఫానులో చిక్కుకుపోయావ్
కాలుష్యంలో కలిసిపోయావు

అవకాశవాద పాదం కింద బందీవైన బంతివి నీవు
నీవారి మీద విసరబడే ఆయుధానివి నీవే
నేడో రేపో నాలుక కరుచుకున్న మేక తలవై
పెంటకుప్పల్లో పడనున్నావ్

పేడ పురుగులెప్పుడూ
ఆత్మీయ ఆలింగనానికి సిద్ధంగా ఉంటాయ

- పర్కపెల్లి యాదగిరి, 9299909516