సాహితి

కాలం కక్ష కట్టినా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపం వెలిగిస్తే చీకటి భయపడుతుందా
తన కాయానికి గాయమవుతుందని
చీకటి గాయానికి భయపడితే సృష్టికి వెలుగుండదు
జడిగడియన నీలినింగి ఉలిక్కిపడుతుందా
మెరుపు తన దేహానికి చురక పెడుతుందని
వానకి ఆకసం జడిస్తే పుడమి గర్భం దాల్చదు
కోత తప్పదని విత్తనం మొలకెత్తనంటే
ఆ విత్తనం వంశం అక్కడితో అంతమవుతుంది
మోత ఎందుకని మబ్బు ఒకేసారి వర్షిస్తే
వరద సృష్టికి సృష్టి అల్లాడుతుంది
తేనెటీగలకి భయపడితే మధురం మన వశమవుతుందా?
గమ్యం దరి చేరే దారిలో ఆటంకాల ధార అనివార్యం
ఎద పడే వ్యథ కన్నీటికి తెలియకూడదు..
ముళ్ళదారి నీ ప్రయాణం కథ అడగకూడదు..
పాదాలు కందిపోయినా నడక ఆపకూడదు
కాలం కక్ష కట్టినా కన్నీరు రాకూడదు..
ప్రయత్న లోపం ఉండకూడదు.

- అల్లం అరుణ్‌కుమార్