సాహితి

వలస పక్షులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం పుట్టుక నుండి మరణం వరకు
వలస బాధ్యతను తన భుజస్కంధాల మీద
మోస్తూనే వుంటూంది
అది మానవ వలస కానీ, పక్షుల వలస కానీ
కాలం సృష్టించిన రేఖలపైనే పయనిస్తూంటుంది

పక్షులు భావాల అంతర్యుద్ధంలో భావమై
విశాల ఆకాశంలో నిర్ణయాత్మకంగా పరుగెడతాయ
వాటి రెక్కలు నిరంతరపాయంగా కదులుతూ
జీవన రేఖపై దూరదృష్టిని నిలుపుతాయ
ఆ పక్షుల గమ్యం... లక్ష్యం ఒక్కటే
ఆహారం - నీరు వాటి వలస లక్ష్యమైతే
స్వేచ్ఛ వారి జీవిత లక్ష్యం
చివరికి వాటి గమ్యం ఐకమత్యమే
మనుషులు నిర్మించుకున్న సమాజం
ఎన్నో కుట్రలు - కుతంత్రాలు సాగినపుడు
ఐక్యతాభావం లోపించి శత్రుత్వ భావానికి లోనై
బ్రతుకు నీడలను విచ్ఛిన్నం చేసుకుంటూంది

అదే పక్షులు నిర్మించుకున్న సమాజం
నిర్విఘ్నంగా ఐక్యతా భావాలతో
రెపరెపలాడుతూంది
వాటి హృదయం ఆనందంతో ఆకాశమంతా వ్యాపిస్తూ
వలస భావాన్ని మైమరచిపోతాయ

వలస పక్షులు ఒక నిర్ణయాత్మకమైన చట్రాన్ని
నిర్మించుకుని
ఆ చట్ర పరిధిలోనే జీవన యానం సాగిస్తాయ
ఆకాశం నిండా రెపరెపలాడుతూ లయాత్మకంగా
భవ బంధాల్లో ఇమిడి ఒకరినొకరు
ప్రేమ ప్రాణులవుతారు

- యం.డి. నజీరుద్దీన్