తెలంగాణ
చండీయాగానికి అంకురార్పణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జగదేవ్‌పూర్, నవంబర్ 27: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పించిన అయుత చండీయాగానికి శుక్రవారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంకురార్పణ చేశారు. డిసెంబర్ 23 నుండి 27 వరకు శైవ సంప్రదాయంలో జరిగే ఈ యాగానికి అంకురార్పణగా కేసిఆర్ దంపతులతో అర్చకులు హోమం నిర్వహింపజేశారు.
అయితే నాలుగు రోజులపాటు నిర్వహించే చండీయాగానికి ముందు 11 యాగాలు చేయనున్న దృష్ట్యా మొదటగా నవయాగాన్ని ప్రారంభించారు. మరో పది యాగాలు పూర్తి చేసిన అనంతరం డిసెంబర్ 23 నుండి అయుత చండీయాగం మొదలవుతుంది. ఈ యాగానికి పలువురు పీఠాధిపతులు, ఐదువేల వేద బ్రాహ్మణులతోపాటు దేశ ప్రధాని, రాష్టప్రతి, ఇతర రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. దీనికోసం 30ఎకరాలలో ఏర్పాట్లు చేశారు. ఈ యాగం నిర్వహణ బాధ్యతలను నిజామాబాద్ బాల్‌కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి భుజానికెత్తుకున్నారు. చండీయాగానికి ప్రముఖులు తరలివస్తున్నందున జిల్లా ఎస్‌పి సుమతితోపాటు ఇంటలిజెన్స్ ఐజి శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సిపి మహేందర్‌రెడ్డి బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా చండీయాగం అంకురార్పణ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు త్రిపుర శర్మ, గోపాలకృష్ణశర్మ, మహేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10.30గంటలకు ప్రారంభమైన ఈ యాగం నాలుగు గంటల వరకు కొనసాగింది. యాగం అనంతరం కేసిఆర్ హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళారు.
chitram...
ఎర్రవల్లిలోగల ఫాంహౌస్‌లో ఏర్పాటు చేసిన
యాగం