ఆంధ్రప్రదేశ్‌

ఎస్టీ జాబితాలో ‘నాయకపోడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 25: నాయకపోడు కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ‘నాయకపోడు’ విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగాల కోసం జరుగుతున్న పోరాటంపై గత పార్లమెంటు సమావేశాలలో ఎంపీ కేశినేని నానీ ప్రస్తావించారు. ఇదే విషయమై సీఎం చంద్రబాబుతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి నాయకపోడు కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నాయకపోడు కులస్థులు అధికంగా ఉన్న విస్సన్నపేట, ఎ.కొండూరు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని కృషిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.