సబ్ ఫీచర్

సాంగత్యంతోనే సచ్ఛీలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం చేసే సాంగత్యమే మన ఉన్నతికి దుస్థితికి కారణవౌతుంది. ఈ ప్రపంచంలో సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం అని రెండు రకాలు. లోకంలో సజ్జనులు తక్కువగాను, దుర్జనులు ఎక్కువగాను ఉంటుంటారు. సజ్జన సాంగత్యం చేయాలని సకల శాస్త్రాలను చెబుతున్నాయి. దుర్జనుల వల్ల సమాజానికి భయోత్పాతాలు ఏర్పడితే సజ్జనుల వల్ల సమాజాభివృద్ధి కలుగుతుంది. గాడిద గంధపు వాసన గుర్తె రగునట్లే దుర్జనులకు సజ్జనుల చెప్పే సూక్తులు, వారి చేష్టలు వీరికి తెలియవు. సహజంగా మంచి వారైనా సహవాస దోషం వల్ల చెడువానిగా మారిపోతాడు. ఇహంలో సుఖాన్ని అనంతరం ముక్తిని ప్రసాదించేది సజ్జన సాంగత్యమే. మనలో స్నేహం కోసం ప్రాణాలర్పించే వాళ్లు కొందరైతే తమ సర్వస్వం ధారపోయడానికి సిద్ధ పడి వారు మరికొందరున్నారు.
కుచేలుడు ప్రేమతో పట్టుకొచ్చిన అటుకులను ఎంతో ప్రీతిగా ఆరగించిన శ్రీకృష్ణుడు అతనికి అడగకుండానే అష్టైశ్వర్యాలనుప్రసాదించాడు. అర్జునుడు, కృష్ణుడు మంచి స్నేహి తులు. బంధువులు అది వేరే సంగతి. కాని, యుద్ధానికి వెళ్లేముందు కృష్ణుని దగ్గరకు వచ్చిన అర్జున దుర్యోదనులు లసాయం అడగడానికి వచ్చి విజ్ఞత కనబర్చినవాడు మేధావి అర్జునుడే కనిపిస్తాడు. వారిద్దరి స్నేహం వల్ల అర్జునునిలో కృష్ణ్భక్తి, కృష్ణసామర్ధ్యం పై సరియైన అవగాహన కలిగించు కున్న వారలో అర్జునునితెలివి కని పిస్తుంది. కర్ణుడు, శకునితో స్నేహం చేసిన దుర్యోధనుడు దైవాని కన్నా మనుష్యులను నమ్మడం మంచిదను కొంటారు. దుర్యోధనుడు నీళ్లలో దాగడం చూసి కృష్ణుడి సైన్యాన్ని కోరి కొరివి తెచ్చుకున్నాడా అనిపిస్తుంది. మంచి సహవాసం బుద్ధి మాంధ్యా న్ని తొలగిస్తుంది. నిర్భీతిగా మన చేత నిజాన్ని పలికిస్తుంది. పాపాన్ని పోగొడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు తెచ్చి పెట్టి మనకీర్తిని విశ్వవ్యాప్తం చేస్తుంది. అందుకే ఆచితూచి స్నేహం చేయాలి. స్నేహం చేయ మన్నారు

- దూరి వెంకటరావు