మెయిన్ ఫీచర్

వింటర్ స్టయిల్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇష్టమున్నా..లేకున్నా చలి కాలంలో ప్లాయిడ్స్‌ను అమితంగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి చలిని తట్టుకునేలా వూల్‌తో స్టయిల్‌గా తయారుచేస్తారు. యువతులు అమితంగా ఇష్టపడే ఈ ప్లాయిడ్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. స్కాట్లాండ్‌లో పుట్టిన టార్టాన్ వస్త్రంతో ఈ ప్లాయిడ్స్ రూపుదిద్దుకుంటాయి. నిలువు, అడ్డం గీతలతో చెక్స్ తరహాలో ఉండే టార్టాన్ వస్త్రం స్కాట్లాండ్‌లో ప్రసిద్ధి. అక్కడ సైనికుల దుస్తులకు సైతం టార్టాన్‌నే వాడతారు. ఉత్తర భారతంలో చలి ఎక్కువ కాబట్టి
ప్లాయిడ్స్‌గా డిజైన్ చేసి అమ్ముతారు.
ఈ ప్లాయిడ్స్ మగవారికీ, ఆడవాళ్లకూ వేర్వేరు డిజైన్లలో రూపొందించి మార్కెట్లోకి విడుదల చేస్తారు. మెత్తగా, చలిని తట్టుకునేలా ఉండే ఈ దుస్తులు విభిన్న రంగుల్లో, కనువిందు చేసే డిజైన్లలో వస్తున్నాయి. టార్టన్స్‌తో మహిళల హ్యాండ్ బ్యాగ్స్, లగేజీ బ్యాగ్స్, అందమైన టోపీలు సైతం తయారు చేస్తారు. మన్నికగా కనిపించే వీటిని చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. టార్టాన్ ప్లాయిడ్స్ ఎరుపు, నలుపు, తెలుపు, నీలం, పసుపు రంగుల్లో మార్కెట్లోకి స్టయిల్‌గా వస్తున్నాయి. ప్లాయిడ్స్‌తో పాటు సింపుల్‌గా మేకప్ వేసుకుంటే మీ అందం రెట్టింపు అవుతుంది. చలికాలం కదా అని ఎపుడూ మెయిన్‌టెయిన్ చేసే స్టైల్‌ను ఇపుడు వదలేయలేం కదా!.మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మనమూ మారక తప్పదు. అందునా ఆధునిక యువత ఈ కాలంలో స్టైల్‌ను వదులుకోవటానికి సుతరామూ ఇష్టపడదు. ఓ వైపు యువత అభిమానించే నటీనటులు ఏ కాలంలో ఏలా ఉండాలో వస్త్ధ్రారణలో మార్పులు చేసుకుంటుంటే మరి వారిని అనుకరించకుండా ఉంటారా? ఉత్తర భారతంలో సినీ నటులు ప్లాయిడ్స్‌నే ధరిస్తారు. ఈ కాలం అంతా వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రెడ్ కార్పెట్స్ నుంచి ఫ్యాషన్ ప్రదర్శనల వరకు ప్రముఖులు ప్రతిచోటా ప్లాయిడ్స్‌నే ధరిస్తారు. నలుపు,తెలుపు రంగుల్లో నిలువు, అడ్డం గీతల్లో కనిపించే ప్లాయిడ్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. మినీ దుస్తుల్లో అనుష్కాశర్మ ఎలా చూడముచ్చటగా ఉందో చూడండి. అధునాతన స్కర్ట్ ధరించి ప్రణీతా చోప్రా, ఫ్యాంట్ సూట్‌లో దీపికా పదుకునే, శ్రద్ధాకపూర్, కంగనారనౌత్, కరీష్మాకపూర్, ఆలియాభట్ తదితరులు కాలానికి తగ్గట్లు స్టైల్ మెయిన్‌టెయిన్ చేయటంలో ముందు వరుసలో ఉంటారు. చలి తీవ్రత పెరిగినట్లే యువత కూడా ఎవరికి వారు స్టైల్‌గా ఉండటానికి ఈ కాలంలో ప్రయత్నిస్తారు. వార్డురోబ్‌లో ఉండే ప్లాయిడ్స్‌ను బయటకు తీస్తారు. టార్టాన్ కోట్స్ యువతీ యువకులిద్దరికి ఈ కాలంలో ఉపయోగిస్తారు. అందుకే ఫ్యాషన్ డిజైనర్లు సైతం ప్లాయిడ్స్‌కు ఆధునిక డిజైన్లు అద్ది మార్కెట్లోకి విడుదల చేశారు. కరిష్మాకపూర్, షారూక్ ఖాన్, అలియాభట్‌లు సైతం టార్టాన్ దుస్తులనే ఈ కాలంలో ధరిస్తారు.
ఈ దుస్తులను కూడా చూడటానికి కలర్‌ఫుల్‌గా, ఆనందం కలిగించేటట్లు చలికాలాన్ని బీట్ చేసేలా ఎంపిక చేసుకోవాలి. అలియాభట్ ఈ కాలంలో పసుపు రంగు ప్లాయిడ్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతోంది. మార్కెట్లోకి వింటర్ కోట్స్, క్యాప్స్, పఫ్ఫర్ జాకెట్స్ స్టయిల్‌గా వచ్చేశాయి. ఇవి మెత్తగా.. వదులుగా ఉండేటట్లు చూసుకోవాలి. పాదాలకు ధరించే షూస్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. స్లిప్పర్లు, రబ్బరు బూట్లు ధరించకపోవటం ఎంతో మంచిది.
ఇక మేకప్ విషయానికి వస్తే లేయర్స్ వదిలేయండి వాటర్ ప్రూఫ్ మేకప్ ఎంతో ఉత్తమమైన మార్గం అని చెబుతున్నారు. మేకప్ నిండుగా వేసుకున్నా ఆయిల్ కంటెంట్ లేకుండా జాగ్రత్తపడాలి. బుగ్గల మీద లైట్ కలర్ పౌడర్ వాడితే సరిపోతుంది. పెదాలను స్ట్రాబెర్రీ వలే ఎర్రగా ఉంచుకుంటే అందంగా ఉంటారు. కరెంట్ షాకు ఇచ్చినట్లు బ్లూ కళ్లతో మిలమిల మెరిసేపోయేటట్లు మేకప్ వేసుకోమని సలహా ఇస్తున్నారు మరింకెందుకు ఆలస్యం కాలంతో పాటు కొత్తదనాన్ని ఆహ్వానించినపుడే మనకంటూ ఓ స్టైల్ ఉంటుందని గ్రహించండి.