అమ్మో..హన్సిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో రాజకుమారిలా ప్రిన్సీ స్టైల్లో ఫాలోయింగ్ వున్న హన్సిక తెలుగులో సరైన అవకాశాలను దక్కించుకోలేకపోయింది. ఇహ లాభం లేదని కోలీవుడ్ వెళితే, అక్కడ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆమె వుంటేనే చాలు సినిమా హిట్ అన్న రేంజ్‌కి చేరింది. దీంతో హన్సికకు అభిమాన సంఘాల తాకిడి ఎక్కువైంది. దీంతో తన మార్కెట్‌ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది హన్సిక. ఈ నేపథ్యంలో తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట. దానికితోడు ఎక్కడికివెళ్లినా తనతోపాటు వచ్చే పదిమంది సిబ్బందిని భరించాలంటోందట. షూటింగ్ సమయంలో ఈ అమ్మడికి ఖర్చులన్నీ ఫైవ్‌స్టార్ రేంజ్‌లో సాగాల్సిందే. హోటల్లో రూములు, ఫుడ్స్ కాక ఆమె స్ట్ఫా కూడా అన్నీ ఆ రేంజ్‌లోనే సాగాలని చెబుతోంది. ఇదంతా నిర్మాత ఖర్చుతోనే సాగాలని కూడా హన్సిక అభిమతం. రానూ పోను ఫ్లైట్ టికెట్స్‌తోపాటు షూటింగ్ ప్యాకప్ చెప్పేదాకా ఈ అమ్మడి ఖర్చులతోపాటుగా వెంబడి వస్తున్న సిబ్బంది ఖర్చులు కూడా దిమ్మతిరిగేలా వుంటున్నాయని నిర్మాతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ విషయంపై కొందరు హన్సికను తప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. అంతేమరి, మార్కెట్ వున్నపుడే కదా ఎవరి హవానైనా సాగేది!