బిజినెస్

మళ్లీ పుంజుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 7: వరుసగా రెండు రోజులు పడిపోయిన దేశీయ మార్కెట్లు గురువారం పుంజుకున్నాయి. ఇటీవల ధరలు పడిపోయిన బ్యాంక్, ఆటో, లోహపు రంగాలకు చెందిన షేర్లను తక్కువ స్థాయి వద్ద కొనుగోలు చేయడానికి మదుపరులు పూనుకోవడంతో మార్కెట్ ప్రధాన సూచీలు పైకి ఎగబాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 352 పాయింట్లు పుంజుకుంది. 50 షేర్లతో కూడిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా బాగా పుంజుకొని 10,100 పాయింట్ల మార్కుపైన ముగిసింది. విలువయిన షేర్లు అయి ఉండికూడా ఇటీవల ధరలు పడిపోయిన వాటిని ఎంపిక చేసుకొని మదుపరులు కొనుగోళ్లకు పూనుకోవడం వల్ల మార్కెట్ సూచీలు పుంజుకున్నాయని బ్రోకర్లు తెలిపారు. గురువారం సెషన్ అంతా కొనుగోళ్లు జరగడంతో 30 షేర్లతో కూడిన సెనె్సక్స్ 32,992.45 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు స్వల్పంగా తగ్గి 352.03 పాయింట్ల (1.08 శాతం) లాభంతో 32,949.21 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబర్ ఒకటో తేదీన 387.14 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్, ఆ తరువాత ఒకే రోజు ఇంత భారీగా పుంజుకోవడం ఇదే మొదటిసారి. నవంబర్ 30న 33,149.35 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ ఆ తరువాత ఇంత గరిష్ఠ స్థాయిలో స్థిరపడటం కూడా ఇదే మొదటిసారి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు, ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన అర్ధ భాగానికి ద్రవ్యోల్బణం అంచనాను పెంచడంతో సెనె్సక్స్ బుధవారం 205 పాయింట్లు పడిపోయింది.
నిఫ్టీ కూడా గురువారం 122.60 పాయింట్లు (1.22 శాతం) పెరిగి 10,166.70 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఇంట్రా-డేలో ఈ సూచీ 10,182.65- 10,061.90 పాయింట్ల మధ్య కదలాడింది. మే 25న 149.20 పాయింట్లు పెరిగిన నిఫ్టీ, ఆ తరువాత ఒకే రోజు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటిసారి. టెలికం, దీర్ఘకాలం మన్నిక గల వస్తువులు, విద్యుత్తు, క్యాపిటల్ గూడ్స్, ఆటో, చమురు- సహజవాయువు, స్థిరాస్తి రంగాల షేర్లు పుంజుకోవడంతో బీఎస్‌ఈ రంగాల వారీ సూచీలు కూడా గురువారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మూడు శాతం తగ్గి, బారెల్‌కు 63 డాలర్లకన్నా దిగువకు పడిపోయిన నేపథ్యంలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు 1.83 శాతం వరకు లాభపడ్డాయి. ఇదిలా ఉండగా, బుధవారం దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు నికరంగా రూ. 995.11 కోట్ల విలువ గల షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ ఫండ్స్ రూ. 1,217.92 కోట్ల విలువ గల షేర్లను విక్రయించాయి. సెనె్సక్స్‌లోని షేర్లలో భారతి ఎయిర్‌టెల్ షేర్ గురువారం అత్యధికంగా 6.08 శాతం పెరిగింది. లాభపడిన మిగతా షేర్లలో ఆసియన్ పెయింట్స్, మారుతి సుజుకి, టాటా స్టీల్, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, లుపిన్, అదాని పోర్ట్స్, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఈ కంపెనీల షేర్ల ధరలు 3.29 శాతం వరకు పెరిగాయి. అయితే సన్ ఫార్మా, విప్రో, సిప్లా, టీసీఎస్, కోల్ ఇండియా షేర్లు నష్టపోయాయి.
ఆసియా ఖండంలోని ప్రధాన సూచీలు కూడా గురువారం పైకి ఎగబాకాయి. జపాన్‌లోని నిక్కెయి 1.45 శాతం పెరుగగా, హాంకాంగ్‌లోని హాంగ్ సెంగ్ 0.29 శాతం పెరిగింది. అయితే షాంఘై కాంపోజిట్ సూచీ 0.67 శాతం పడిపోయింది.