ఆంధ్రప్రదేశ్‌

తొలి అర్ధ సంవత్సరంలో 11.37 శాతం వృద్ధిరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: తొలి అర్ధ సంవత్సరంలో 11.37 శాతం వృద్ధి రేటును సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దేశంలో అన్ని రంగాల్లోనూ ఏపీ నెంబర్ 1గా నిలిచిందన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు. గత 6 నెలల కాలంలో భారతదేశంలో 5.8 శాతం అభివృద్ధి రేటు ఉండగా ఆంధ్రప్రదేశ్ 11.37 శాతం అభివృద్ధి రేటు సాధించిందన్నారు. దాదాపు రెట్టింపు వృద్ధి రేటు నమోదు చేశామన్నారు. వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ 2016-17 ఆర్థిక సంవత్సరానికి 25.6 శాతం సాధించగా, దేశంలో 2.3 శాతం సాధించిందన్నారు. పరిశ్రమల రంగంలో ఆంధ్రప్రదేశ్ 7.43 శాతం సాధించగా, దేశంలో 3.6 శాతం నమోదైందన్నారు. సర్వీస్ సెక్టార్‌లో ఏపీ 8.38 శాతం సాధించగా భారతదేశంలో 7.9 శాతంగా నమోదైందన్నారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా భారతదేశ అభివృద్ధితో పోల్చుకుంటే రాష్ట్రం వివిధ రంగాల్లో రెండంకెల అభివృద్ధిని నమోదు చేస్తూ ముందుకు వెళుతుందన్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నామన్నారు. దేశ సగటుతో పోటీ పడుతున్నామన్నారు. ఇంత కష్టపడుతుంటే, కొందరు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. సుస్థిర అభివృద్ధి ఉండాలంటే సుస్థిర ప్రభుత్వం ఉండాలన్నారు. అందుకే అన్ని వర్గాల మద్దతు కోరుతున్నామన్నారు. ఈ వృద్ధి రేటును మరింత పెంచేందుకు చర్యలు తీసకుంటామన్నారు. వృద్ధి రేటుకు సంబంధించి 40 గ్రోత్ ఇంజన్లు ఉంటాయని, వీటిపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. వీటిలో సబ్ గ్రూపులు మరో 40 ఉంటాయన్నారు. వీటిని కూడా నెలవారీ సమీక్ష చేస్తానన్నారు. రియల్ టైమ్‌లో పర్యవేక్షించడం వల్ల ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేసుకునే వీలు ఉంటుందన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో టెస్టులు నిర్వహించి లోపాలను సరి చేసుకున్న తరహాలో నెలవారి సమీక్షలు, డ్యాష్ బోర్డు అనుసంధానంతో సరి చేసుకుంటామన్నారు. దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా ఉన్నా, ఇంకా కష్టాలు ఉన్నాయన్నారు. ఈ వృద్ధి రేటు 15, 20 సంవత్సరాలు కొనసాగించాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలన్నారు. 80 శాతం ప్రజల సంతృప్తి, 80 శాతం పొలిటికల్ ఓనర్‌షిప్ ధ్యేయంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామన్నారు.