సబ్ ఫీచర్

ఎవరి అజెండా వారిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అజెండా ఉంది. ‘కార్మికులు, కర్షకులు, కూలీలు, కడుపు కాలుతున్నవాళ్లూ మాత్రమే సేవ చేయదగ్గవాళ్లు’ అని ఒక పార్టీ అంటే ఫలాని ప్రాంతీయులంతా తమవారని ఇంకో పార్టీ చెబుతుంది. ఫలాని కులంవారు మాత్రమే తమకు ఆప్తులు అని ఒక పార్టీ అంటే, ఫలాని మతం వారు మాత్రమే తమకు ఆప్తులని ఇంకో పార్టీ అంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తమను ఎముకలు, కండ, రక్తం, ప్రాణాలు అని ఒక పార్టీ చెబితే, ఈ దేశాన్ని ప్రేమించేవారంతా తమ సంతతేనని మరో పార్టీ చెబుతుంది. అన్ని పార్టీలూ మాత్రం ముక్త కంఠంతో నినదించే స్లోగనొకటుంది. అదేంటో స్పష్టంగా బయటపడకపోయినా, అందరూ మాత్రం మూకుమ్మడిగా ఆ మాట వాడుతుంటారు. అదే, ‘సెక్యులరిజం’..ఇంతవరకు బాగానే ఉంది. ఏదో అర్థం అవుతున్నట్టు, అనిపిస్తున్నట్టు, తోస్తుంటుంది.
కానీ అస్సలు అర్థం కాని మాటొకటుంది. దీన్ని ఒకటి, రెండు పార్టీలు మాత్రమే తమ అజెండాగా ఉద్ఘోషిస్తుంటాయి. ఉండుండి, ఊపొచ్చినప్పుల్లా వదిలిపెడుతుంటాయి. ఇటీవల ఒక పార్టీ పెద్ద, ఇదే తమ పార్టీకి అసలు ప్రాణం అనడం జరిగింది. సెక్యులరిజం లాగే ఇదేమిటో ఆ పార్టీ ఎప్పుడూ చెప్పలేదు. మనం ఊహించుకోవలసిందే. ఎవరి ఊహ వారిది..అదే ‘మిశ్రమ సంస్కృతి.’
అసలు సంస్కృతి అంటే ఏమిటి? ఒకే అలవాట్లు, సంప్రదాయాలూ, నమ్మకాలూ, చావు పుట్టుకల మీద విశ్వాసాలు, మరణానంతర జీవితం, ఉంటే గింటే మళ్లీ జీవితం వగైరా వాటిమీద సిద్ధాంతాలూ, ఒకే శత్రుమిత్ర భావనలు, ఒకే ఎల్లలు- ఇవన్నీ ఎవరికి ఉంటాయో, వాళ్లందరి జీవన విధానాన్ని - అనగా ‘జాతి’ జీవన విధానం మొత్తాన్ని కాచి వడబోస్తే వచ్చే సారమే సంస్కృతి. అంటే, విద్యావిధానం, ఆరోగ్యశాస్త్రం, ఆహార విహారాదులు, క్రీడా వినోదాలు, వాస్తు, యుద్ధ విద్యలూ, శిల్పకళ, సంగీత సాహిత్యాలు, వీటి నుంచి పుట్టిన జానపద కళలూ, కట్టూ, బొట్టూ, వివాహాల తీరుతెన్నులూ, పరుగులూ, భార్యాభర్తల మధ్య సంబంధమూ, తల్లులను గౌరవించడం, ఇలా మొత్తం జీవన విధానం అంతా కలిపితే వచ్చేదే ‘సంస్కృతి.’
ఈ దేశానికి మాత్రమే చెందిన ‘హిందువులు’ అనబడే జాతికి ఈ విధంగా ఒకే సంస్కృతి ఉంది. ఈ ‘ఒకే’ తనం మనకు కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా, చాలా స్పష్టంగా కనిపిస్తూంటుంది. ఎనిమిది వందల ఏళ్ల తరుష్క దోపిడీ మూకల పరిపాలన వలన గానీ, రెండువందల ఏళ్ల యూరోపియన్ల పాశవిక పరిపాలన వల్ల గానీ ఈ హిందువుల సంస్కృతి అంతరించిపోలేదు (కొంచెం బలహీన పడివుండవచ్చు). కానీ చమక్ మని ఒక వెలుగు వెలిగి పూర్తిగా అంతరించి పోయిన, గ్రీకు, రోమను, మాయా,ఆజ్‌టెక్ నగర జాతుల సంస్కృతుల సంపూర్ణ మరణంతో పోల్చినప్పుడు ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదా?
దీనికి కారణం ఏమిటి? ఏమిటంటే, ఈ సంస్కృతి స్వభావం వ్యక్తులమీద ఆధారపడి ఉండకపోవడమే. మానవ స్వభావం యొక్క సహజత్వం మీద, ఆధారపడి ఉండటమే. ఈ సంస్కృతీ స్వభావం ఈ దేశంలోని కొండల్లో, గుహల్లో, ఎడారుల్లో, మంచులో, నదుల్లో, గుట్టల్లో, చెట్లల్లో, చేమల్లో, సముద్ర తీరాల్లో-అంతటా రంగరించుకుపోయి, వాటిల్లో ఒకభాగమైపోయింది! ఇట్లాంటి సంస్కృతిని-డస్టర్‌తో సుద్దరాతను తుడిచినట్టు, చెరిపెయ్యగలమా? లేము గద! శ్రీనగర్ వెళ్లి ‘ఇక్కడికి శంకరాచార్యులు వచ్చాడా? ఏ ట్రైయిన్ మీద?’ అని అక్కడి జనాన్ని అడిగి బుర్ర తిప్పగలమా? ‘అజంతా ఎల్లోరా గుహల్లోని దేవతా విగ్రహాలు దేవతలూ కాదు, పాడూ కాదు,’ అనే సాహసం చెయ్యగలమా? అస్సాంలోని కామాఖ్యాదేవి ఆలయంలోకి వెళ్లి, ‘‘ఇది అమ్మవారి అవయవ మేంటి, అదొక్కటే వచ్చి ఇక్కడ పడటమేంటి?’’అని గట్టిగా అరిచి బతికి బట్టకట్టి బయటపడగలమా? గుజరాత్‌లోని భేంట్ ద్వారకకు వెళ్లి ‘‘ఇక్కడ తిరిగింది కృష్ణుడు కాదు (ఎవడో) ఘజినీ ఖాన్’’ అని ఆరోగ్యంతో తిరిగి రాగలమా? ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌కెళ్లి, ‘‘ఇక్కడి నుంచి పాండవులు స్వర్గానికి వెళ్లడం ఏంటి? నాన్‌సెన్స్’’ అని వక్కాణించి సాపువీపుతో వెనక్కి రాగలమా? ఎక్కడ చూసినా కాషాయం గుడ్డ కనిపిస్తే అది దేవళం అవుతున్నదెందుకు?..అసలు..అసలు..నిన్న...రామేశ్వరం దగ్గరున్న వారథి’’ రాముడు కట్టింది కానేకాదు’’ అన్న వాళ్లంతా ఇవ్వాళ తోక ముడిచారెందుకు?..ఇట్లా ఎన్నని?
ఏతావాతా తేలేదేమంటే, ఈ హిందూ సంస్కృతి నశించడం అసంభవమూ, ఈ సంస్కతిలో వచ్చే మార్పులు లేవు. కనక మారదు!
***
కానీ మార్చాలని చూస్తున్నారు కొందరు. దీన్ని ‘మిశ్రమం’ చేస్తారట! దేనితో చేస్తారు? వాళ్లు నోటితో చెప్పరు? వాళ్లు అంటుంటారు..‘‘ మన దేశంలోది మిశ్రమ సంస్కృతి. మీరంతా కలిసిపొండి.’’
మనం అంటాం,‘‘మేం కలిసే ఉన్నామండీ బాబూ...శాంతిగానే జీవిస్తున్నాం. ఎవరి బతుకు వారు బతుకుతూ శాంతిగా ఉండడం మాకు యుగ యుగాల నాటి విద్య!’’
వాళ్లంటారు,‘‘అహా..హా, అలా చాలదు, ఇంకా దగ్గరగా కలిసిపొండి.’’
తల్లి నాస్తికురాలైనా సరే, తల్లి కాళ్లకి ఆ కొడుకు నమస్కరించాలని హిందువులు చెబుతారు. కానీ అవతలి వాళ్లు ‘ఆమెను ఆ కొడుకు శిక్షించాలి’ అని చెబుతారు. వంటికి విటమిన్లు ఎక్కి ఎముకలు గట్టి పడడంకోసం సూర్యోదయ సమయంలో తూర్పుకు తిరిగి ఆ ఎండలో యోగా చెయ్యమని మనం చెబుతాం. కానీ వాళ్లు రోజుకు ఐదుసార్లు పడమరకు తిరిగి బోర్లా పడుకుంటారు. అవుతాలూకు పదార్థాల-పంచగవ్యం-తో క్యాన్సర్ పోతుందనీ, రాదనీ మనం ఆవులను సేవిస్తాం. కానీ వాళ్లు ‘ఆవుకాదు, ఒంటె’ అంటారు. ‘దేవుడు అనేది ఒక శక్తి. ఆ శక్తే అంతటా ఉంది’ అంటాం.‘‘అబ్బెబ్బే, ఆయన స్వర్గంలో మాత్రమే ఉంటాడు’’ అంటారు వాళ్లు. ‘‘దేవుడివి నువ్వే, అట్లా జీవించు’’ అంటాం. ‘కుదర్దు..మధ్యలో కొరియర్‌గా ప్రవక్త ఉండాల్సిందే’’ అంటారు వాళ్లు. ‘ఓం’ అనే అక్షరం శివుని డమరుకంలోంచి వచ్చిందనే విశ్వాసంతో ఆ ‘ఓం’తోనే మనం చదువుమొదలు పెడతాం. (ఇటీవల నాసావాళ్లు పంపిన ఉపగ్రహం, సూర్య మండలంలోని శబ్దాలను రికార్డు చేసి పంపిందట. ఆ శబ్దాలు సరీగ్గా ఓంకారంలాగానే ధ్వనిస్తున్నాయట-వీడియో ఒకటి యూట్యూబ్‌లో విహరిస్తోంది!) శవాన్ని తగలబెట్టేటప్పుడు ‘‘ ఓ పంచ భూతాల్లారా, మీ మీ అంశలను తీసుకు పొండి’ (సూర్యం తే చక్షుర్ గచ్ఛతు, వాతం ఆత్మా!) అని ఆహ్వానిస్తాం. ఇంకా కాళ్లకు పసుపు, మొహాన బొట్టూ, ముగ్గులు, తోరణాలు, పల్లకీలో ఊరేగింపులు, యజ్ఞోపవీతాలూ, శిఖలూ (ఒరిస్సాలో అందరికీ ఉంటాయి) గ్రహణ స్నానాలూ, కుంఛమ్‌ళాలు, మహోదయాలు- ఇట్లా ఎన్నో విశ్వాసాలు మనకున్నాయి.
ఇవ్వేమీ వాళ్లకి లేవు. అట్లా అని తక్కువగా చూడం. వాళ్ల అలవాట్లు వాళ్లవి! ఉమ్మడిగా మారడం అంటే ఇవన్నీ మనకి లేకుండా పోవడమా? ఇవి పోయేవి కావని చెప్పమన్నాం గదా! మరయితే, పోనీ వాళ్లకి ఎప్పుడైనా చెప్పారా? ఎందుకంటే ఒరిజినల్‌గా వాళ్లు ఇక్కడి వాళ్లే కదా!
లేక వాళ్ల ఆలయం గోడల మీద వీళ్ల ఆలయం, వీళ్ళ ఆలయం గోడల మీద వాళ్ల ఆలయం ఇట్లా కట్టడమే ‘మిశ్రమ సంస్కృతా’?... తమాషా ఏమంటే ‘‘మీరు మిశ్రమ సంస్కృతిని ఆవలంబించండి’’ అని నాయకులు సుద్దులు చెప్పేది హిందువులకే గాని, వాళ్లకు కాదు!...చెప్పుకున్నాం కదా ‘‘హిందువులు తప్ప మిగిలిన వాళ్లంతా, మావాళ్లే, మా ప్రాణమే,’ అనేది ఆ నాయకుల మంత్రం అని! కనుక ఏం చెబుతారు?

- గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు సెల్: 98857 98556