రాష్ట్రీయం

పోలవరం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: విపక్ష పార్టీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం సాగునీటి ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైకాపాకు స్పష్టమైన వైఖరి లేదని, ప్రాజెక్టులను అడ్డుకోవడమే ఆ పార్టీ లక్ష్యమని ధ్వజమెత్తారు. ఆయన గురువారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ , ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజల గుండె చప్పుడైన పోలవరం ప్రాజెక్టును కేంద్రం సహకారంతో పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికి సోమవారం పోలవరం వెళుతున్నానని తెలిపారు. పురుషోత్తమపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులకు వైకాపా అడ్డుపడిందని, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారని విమర్శించారు. గండికోట ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసినా, రైతులు సహకరించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడ్డామన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో దక్షిణ కొరియా పర్యటనలో ఉండగా తాను ఫోన్‌లో మాట్లాడానని గుర్తు చేశారు. రూ.370 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం తక్షణమే కేంద్రం ఇస్తున్నట్లు తెలిపారు. మరో 700 కోట్ల రూపాయలకు బిల్లులు పెట్టాలని కేంద్ర మంత్రి తెలిపారన్నారు. ప్రాజెక్టు పాత అంచనాలు (ఫేజ్-1) 16 వేల కోట్ల రూపాయల్లో 2000 కోట్ల రూపాయల మేర భూసేకరణకు కేటాయించాల్సి ఉందన్నారు. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి రావడం వల్ల భూసేకరణ, పునరావాసానికి 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. కొద్దిమంది ప్రతిపక్ష నాయకులకు అనునిత్యం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చుపై శే్వతపత్రం అడగడం పరిపాటైందన్నారు. కేంద్రానికి కాంగ్రెస్ కూడా ఫిర్యాదు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారన్నారు. ఏ జాతీయ ప్రాజెక్టు పనులైనా ఇంత వేగంగా జరిగాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టు నిధులపై ప్రభుత్వం సమాచారం అందిస్తున్నా ప్రతిపక్ష పార్టీలు శే్వతపత్రం అడగడం అర్థరహితమన్నారు. ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి 14 శాతం తక్కువకు టెండర్ వేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు పనులు గత 2, 3 నెలలుగా కొంత మేర కుంటుపడ్డాయని, ఇందుకు కాంట్రాక్టరు, కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత స్పష్టత లేకపోవడం కారణమన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టు పూర్తికావాలని కోరుకుంటుండగా, వైసీపీ నేత జగన్ దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం భార్గవ్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని పోలవరం ప్రాజెక్టు సందర్శనకు పంపుతోందని, ఇప్పటికే ప్రాజెక్టు పనులు 51.5 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, అఖిల పక్షం చేసే పని కన్నా, కేంద్రం ఎక్కువ చేయాలన్నారు. విమర్శించే నేతలు సానుకూలంగా ఉంటే తనకు అభ్యంతరం లేదని, కానీ ఇప్పుడు వీళ్లను తీసుకుని ఢీల్లీ పోవాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్, వైకాపా సరిగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదికాదన్నారు. వాళ్లకు రహస్య ఎజెండాలు, వేరే ఆలోచనలు ఉన్నాయని విమర్శించారు.
*
పోలవరముపైన పోరాటమే కాదు
పట్టుదలతొ పనులు పూర్తిచేతు
శే్వతపత్రము కాదు స్వర్ణ్భూమిని చేతు
బాబు మాటలుత్త డాబు కాదు