జాతీయ వార్తలు

కుంభమేళాకు యునెస్కో గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: భారత్‌లో వైభవోపేతంగా నిర్వహించే కుంభమేళాకు యునెస్కో గుర్తింపులభించింది. కుంభమేళాను వారసత్వ సంస్కృతిగా యునెస్కో ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ట్వీట్టర్‌లో పోస్టు చేసింది. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన యునెస్కో 12వ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 4న ప్రారంభమైన ఈ సమావేశాలు 9 వరకూ జరుగుతాయి. వారసత్వ సంస్కృతి కల్పించడానికి రూపొందించిన జాబితాలో కుంభమేళాను చేర్టినట్టు సంస్థ వెల్లడించింది. లక్షలాది మంది హిందూ యాత్రికులు హాజరయ్యే కుంభమేళాకు వారసత్వ సంస్కృ తి హోదాకు కల్పించడం సరైనదేనని యునెస్కో పేర్కొంది. ఈ జాబితాలో బొత్సవానా,
కొలంబియా, వెనీజులా, మంగోలియా, మొరక్కో, టర్కీ, యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.‘మన కుంభమేళాకు ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కడం భారతీయులందరికీ గర్వకారణం. ఇది అత్యంత అరుదైన గౌరవం’అంటూ కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మనీష్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. యునెస్కో నిర్ణయాన్ని హర్షిస్తూ మంత్రి ట్వీట్ చేశారు. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే మహా సమ్మేళం కుంభమేళా అని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటను లేకుండా అత్యంత ప్రశాంతగా, క్రమశిక్షణగా జరిగే కుంభమేళా భారత సంస్కృతి, సంప్రదాయాల్లో ఓ భాగమని మంత్రి పేర్కొన్నారు. గురు, శిశ్యుడి సంబంధానికి ప్రతీకగా అభివర్ణించారు.