రాష్ట్రీయం

ఇష్టారాజ్యం కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల దందాపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటి మంత్రి కె తారకరామారావులు గురువారం నాడు స్పందించారు. కడియం శ్రీహరి జెఎన్‌టియు సమావేశంలో స్పందించగా, కెటిఆర్ ట్విట్టర్‌లో స్పందించారు. ఏ విద్యాసంస్థ కోర్సు మధ్యలో ఫీజులు పెంచడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించిన ఫీజులను కాదని కోర్టుకు వెళ్లి కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఫీజులను పెంచడంపై ప్రభుత్వం విద్యార్థుల పక్షానే ఉంటుందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ సమయంలో ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ధారించిన ఫీజులను తీసుకునేందుకు అంగీకరించి, కౌనె్సలింగ్‌లో పాల్గొన్న కాలేజీలు విద్యాసంవత్సరం మధ్యలో కోర్టులకు వెళ్లి ఫీజులను పెంచడం భావ్యం కాదని అన్నారు. కూకట్‌పల్లి జెఎన్‌టియులో కెజిబివిల స్కూల్ లీడర్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను ప్రతి ఏటా కాలేజీ అడ్మిషన్లకు ముందే కమిటీ నిర్ధారిస్తుందని ఈ ఏడాది కూడా అదే విధంగా నిర్ధారణ జరిగిందని అన్నారు. నిర్థారించిన ఫీజులకు అనుగుణంగా ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని, దాని ప్రకారమే అడ్మిషన్లు జరిగాయని అన్నారరు. అయితే కొన్ని కాలేజీల యాజమాన్యాలు మాత్రం కోర్టుకు వెళ్లి ఫీజులను పెంచుతూ అనుమతి తెచ్చుకున్నారని , దీనికి అనుగుణంగా ప్రభుత్వం వద్ద జీవోలు ఇవ్వాలని కోరినా తాము తిరస్కరించామని వివరించారు. పెంచిన ఫీజులను కట్టాల్సిందేనని యాజమాన్యాలు చెప్పడం సరికాదని, అడ్మిషన్ సమయంలో విద్యార్థుల నుండి అఫిడవిట్లు తీసుకున్న సమాచారం ప్రభుత్వం వద్ద లేదని అన్నారు. అలాంటి అఫిడవిట్లు చెల్లవని ఆయన స్పష్టం చేశారు. పెంచిన ఫీజులపై సమగ్ర సమావేశం జరుగుతుందని,
కమిటీ కూర్చుని నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అవసరమైతే అప్పీలుకు వెళ్తామని చెప్పారు.
జనవరి నుండి కొత్త మెనూ
దేశంలో కెజిబివిలను గొప్పగా అభివృద్ధి చేస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. కెజిబివిల స్కూల్ లీడర్స్ -17 కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో అత్యధిక కెజిబివిలు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. గత రెండేళ్లలో కెజిబివిల్లో వసతుల కోసం వంద కోట్లు ఖర్చుచేశామని పేర్కొన్నారు. ఇతర గురుకులాలకు సమానంగా కెజిబివిలలో భోజనం మెనూ రూపకల్పన చేశామని జనవరి 1వ తేదీ నుండి అమలుచేస్తామని చెప్పారు. కెజిబివిల్లో విద్యార్థినిల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. కెజిబివిలను ఎనిమిదో తరగతి నుండి 12వ తరగతి వరకూ విస్తరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. ఏటా 200 కోట్ల రూపాయిలను మోడల్ స్కూళ్లపై ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నవోదయ స్కూళ్ల మాదిరి జిల్లాకో బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించామని చెప్పారు. కెజిబివిల్లో 90 కోట్ల రూపాయిలతో కొత్తగా 61 అకడమిక్ బ్లాక్‌లను నిర్మిస్తున్నామని తెలిపారు.