హైదరాబాద్

ఉచిత సలహాలివ్వొద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశ నిర్వహణలో మేయర్ బొంతు రామ్మోహన్ తనదైన పట్టు సాధించారు. గురువారం ఆయన ఎంతో వ్యూహాత్మకంగా నిర్వహించిన కౌన్సిల్ సమావేశ నిర్వహణే ఇందుకు నిదర్శనం. అధికారులపై సభ్యుల ఆరోపణలు.. ఉచిత సలహాలు, ఆచరణ సాధ్యం కాని సూచనలు చేయొద్దంటూ చెబుతూనే, సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ అధికారులకు సున్నితంగా సూచిస్తూ, వారికి జవాబుదారీతనం తెలిసేలా చాకచక్యంగా వ్యవహరించారు. చెత్త సెగ్రిగేషన్ ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ఆయన నిర్మొహమాటంగా మాట్లాడారు. జనవాసాల మధ్య ఎక్కడబడితే అక్కడ చెత్త వేస్తున్నారని, దీంతో దుర్వాసన వస్తోందని కొందరు సభ్యులు వ్యాఖ్యానించటంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే రాజేంద్రనగర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మాదిరిగా చెత్త డ్రై సెంటర్ ఏర్పాటు చేయాలని కొందరు సభ్యులు వ్యాఖ్యానించారు. దీంతో కమిషనర్ జోక్యం చేసుకుని ప్రతి ఒక్కరు తమ ఇంటి ముందు డస్ట్‌బిన్ ఉండరాదని, తమ కాలనీలో చెత్త కుండీలు పెట్టొదంటూ కోరుతున్న తరుణంలో ఈ డ్రై సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేయగలమని వ్యాఖ్యానించారు. అసహనానికి గురైన మేయర్ సరే మీ డివిజన్లలోని ఖాళీ స్థలాలు, కమ్యూనిటీ హాళ్లు చూపించండి, అక్కడ ఏర్పాటు చేద్దామని సభ్యులను ఎదురు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలపై సభ్యులు అధికారుల పనితీరుపై మండిపడినా, అధికారులను మేయర్ వేనకేసుకొచ్చేలా వ్యవహరించారన్న విమర్శ సైతం లేకపోలేదు.
చట్టానికి లోబడి పనిచేయాలి
గురువారం కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన పలు వార్డు కమిటీల సభ్యులు, ఏరియా సభ సభ్యులు చట్టానికి లోబడి పనిచేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. చట్టం ప్రకారం వీరి విధులను మేయర్ సభాముఖంగా వివరించారు.