కృష్ణ

క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కింగ్‌లో జిల్లాకు ప్రథమ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, డిసెంబర్ 7: సమష్టి కృషితోనే క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కింగ్‌లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ తన సేవలను విస్తృతపర్చడానికి ఆవశ్యకమైన అన్ని చర్యలనూ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కంప్యూటరీకరణ అరంభ దశలో బాలారిష్టాలు ఎదురైనప్పటికీ కోర్ టీం సభ్యుల కృషి ఫలితంగా జిల్లాకు ప్రథమ స్థానం లభించిందని తెలిపారు. 2002వ సంవత్సరం నుండి 2013వ సంవత్సరం వరకు నేరాల నమోదు ప్రక్రియలో కొన్ని చేతిరాతల ప్రతులు కూడా ఎఫ్‌ఐఆర్‌గా రూపుదిద్దుకోవడం జరిగిందన్నారు. అటువంటి ఎఫ్‌ఐఆర్‌లు కొన్ని ఇంటర్‌నెట్ సౌకర్యం లేని మారుమూల పోలీసు స్టేషన్‌లలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనట్లు తెలిపారు. వీటిని అధిగమించి నూరు శాతం కంప్యూటరీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. గతంలో జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శిక్షణ పొంది ఎంపికయిన వారు నమోదు చేయడం జరుగుతుందని, ఎఫ్‌ఐఆర్ స్థాయి నుండి ఫైనల్ రిపోర్టు వరకు ప్రతి కేసునూ కంప్యూటరీకరించే దిశగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక కేసు నమోదైతే అది సుమారు ఏడు దశలు దాటాల్సి ఉంటుందని, ఈ ఏడు దశల్లో కేసుల్లో చోటు చేసుకుంటున్న అభివృద్ధిని కూడా కంప్యూటరీకరించడం ద్వారా బాధితులు ఏ ప్రాంతం నుండైనా తమ కేసు పూర్వా పరాలను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఒక కేసు స్థితిగతులను ప్రపంచంలో ఏ ప్రాంతం నుండైనా పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో ప్రతి స్టేషన్‌లో నియమించిన సీసీటీఎన్‌ఎస్ సిబ్బంది శ్రమిస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రయోగాత్మకంగా కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. 2002 నుండి 2013 వరకు ఉన్న అన్ని కేసులను కంప్యూటరీకరిస్తున్నట్లు ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తికి
లోకాయుక్త నోటీసులు
* కమిషనర్ సహా మరో ముగ్గురికీ...
గుడివాడ, డిసెంబర్ 7: గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో పాటు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్, డీఈలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల లోకాయుక్త నుండి నోటీసులు జారీ అయ్యాయి. బీమ్ ఆర్మీ సంఘం అధ్యక్షుడు దారం కరుణాకర్ లోకాయుక్తకు గత అక్టోబర్ 11వ తేదీన ఫిర్యాదు చేశారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి గుడివాడ మున్సిపాలిటీలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్ళాయని, అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కరుణాకర్ లోకాయుక్తను కోరడంతో 2928/ 2017/బీ1గా ఫిర్యాదును నమోదు చేశారు. గుడివాడ మున్సిపాలిటీ మొత్తం రూ.761.02లక్షలు మంజూరు కాగా దీనిలో రూ.539.49లక్షలను ఖర్చు చేసినట్టుగా చూపించారని, ఓసీ, బీసీ ఏరియాల్లో డ్రైన్లు నిర్మించారని, స్కూళ్ళలో ఫర్నీచర్ నిమిత్తం నిధులను మళ్ళించారని, దాదాపు 60శాతం అవినీతి జరిగిందని, ఇంకా రూ.221.53 లక్షలు ఏమయ్యాయో అధికారులే చెప్పలేకపోతున్నారని, చట్టపరమైన చర్యలు చేపట్టాలని కరుణాకర్ చేసిన ఫిర్యాదుతో ఈ నెల 8వ తేదీ ఉదయం 10.30 గంటలకు లోకాయుక్తకు అన్ని వివరాలనూ సమర్పించేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు.