కృష్ణ

రైతు నెత్తిన వాయు‘గండం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృత్తివెన్ను, డిసెంబర్ 7: ఆరుగాలం కష్టించిన పంట చేతి కందే సమయంలో రైతులకు వాయుగుండాల గండం తప్పేట్లు కనిపించడం లేదు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా సాగునీటి ఇబ్బందులు, వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చిన రైతులు ఈ ఏడాది పట్టిసీమ పుణ్యమా అంటూ అధిక దిగుబడులు సాధించగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆందోళనకు గురి చేస్తోంది. రెండు మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు హడావిడిగా పంట రక్షణ చర్యల్లో బిజీ అయ్యారు. వరి కోతలను ముమ్మరం చేయటంతో పాటు పనల మీద ఉన్న పంటను నూర్పిడి చేసి ధాన్యపు రాశులను ఇళ్లకు చేరుస్తున్నారు. కొంత మంది రైతులు దిగుబడులను అక్కడిక్కడే మిల్లర్లకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు.

జనరేటర్ల దొంగ అరెస్టు
చల్లపల్లి, డిసెంబర్ 7: మూడు లక్షల రూపాయలు విలువ చేసే జనరేటర్లను దొంగిలించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు అవనిగడ్డ డీఎస్పీ వి పోతురాజు తెలిపారు. గురువారం చల్లపల్లి పోలీసు స్టేషన్‌లో నిందితుడిని మీడియాకు చూపించారు. రామానగరానికి చెందిన పద్మ లైటింగ్ వర్క్స్ యజమాని తాతినేని శివ ప్రసాద్‌కు చెందిన 62.5కెవీ, 30కెవీ, 15 కెవీ మూడు జనరేటర్లను అపహరించినట్లు గత నెల 26వతేదీన ఫిర్యాదు అందినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టగా మచిలీపట్నంకు చెందిన మహ్మద్ మస్త్ఫా చోరీకి పాల్పడినట్లు గుర్తించి అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సీఐ జనార్ధన్, ఎస్‌ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.