క్రీడాభూమి

బాలికల హాకీ జట్టుకు చేదు అనుభవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: భారత బాలికల హాకీ జట్టుకు ఆస్ట్రేలియాలో చేదు అనుభవం ఎదురైందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పందించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించాడు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, పెర్త్‌లో పసిఫిక్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొనడానికి భారత బాలికల జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే, అక్కడి విమానాశ్రయంలో దిగిన వారికి అధికారులు ఎలాంటి రవాణా సౌకర్యం కల్పించలేదు. పోటీలు ఎక్కడ జరుగే ప్రాంతం గురించి వాకబు చేసి, బాలికలంతా ఎవరంతట వారు టాక్సీలు మాట్లాడుకొని వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కూడా వారికి సరైన మార్గదర్శకం లభించలేదు. కనీసం పోటీల షెడ్యూల్‌ను కూడా ఎవరూ ఇవ్వలేదు. తాము ఆడాల్సిన మ్యాచ్‌లు ఎప్పుడు ఉన్నాయో తెలియని కారణంగా, ఒక మ్యాచ్‌కి వారు దూరమయ్యారు. కనీసం సౌకర్యాలు లేకపోవడంతో తాము నానా ఇబ్బందికి గురయ్యామని ఆ బాలికలు కన్నీళ్ల పర్యంతమవుతూ చెప్పిన వీడియో క్లిప్పింగ్స్ బయటపడ్డాయి.
ప్రభుత్వం పంపలేదు: ‘సాయ్’ స్పష్టీకరణ
వీడియోలో కనిపిస్తున్న బాలికల హాకీ జట్టును ఆస్ట్రేలియాకు ప్రభుత్వం పంపలేదని భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) స్పష్టం చేసింది. వారు ఏ హోదాలో ఆస్ట్రేలియాకు వెళ్లాలో తెలియదని, ప్రభుత్వం మాత్రం ఆ జట్టును స్పాన్సర్ చేయలేదని వివరించింది. హాకీ ఇండియా గుర్తింపు కూడా ఆ జట్టుకు లేదని పేర్కొంది. ఆస్ట్రేలియాలో బాలికలు ఎదుర్కొన్న ఇబ్బందులకు చింతిస్తున్నామని, అయితే, ఆ సంఘటనకూ ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఏది ఏమైనా విచారణలో వివరాలు తెలుస్తాయని పేర్కొంది.
చిత్రం..రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్