ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ రంగంలోనే డీసీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 7: లాభాలార్జిస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేందుకు గట్టిగా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డీసీఐ ఆఫీసర్స్ అసోసియేషన్, నాన్ ఎగ్జిక్యుటివ్ ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో పలువురు ప్రతినిధులు గురువారం విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబును కలిసి చర్చించారు. లాభాల బాటలో ఉన్న డీసీఐని ప్రైవేటీకరించడం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలను యూనియన్ ప్రతినిధులు వివరించారు. కేంద్రం నిర్ణయం కారణంగా రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి ఆటంకాలేర్పడతాయని, దేశ భద్రతకు కూడా ముప్పు తప్పదని వివరించారు. విదేశీ కంపెనీలు కుమ్మక్కవడం ద్వారా ఆర్థిక భారం పెరుగుతుందని వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు డీసీఐలో వాటాల విక్రయంపై కేంద్రం తనతో ఇంతవరకూ సంప్రదించలేదని పేర్కొన్నారు. డీసీఐ అంతర్వేదిలో ఏర్పాటు చేసే ట్రైనింగ్ ప్రాజెక్టు కోసం రాష్ట్రం 200 ఎకరాల భూములు ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించినా కేంద్రం అంగీకరించలేదన్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కేంద్రంలో డీసీఐ విషయమై చర్చించనున్నట్టు హామీ ఇచ్చారు. డీసీఐ ప్రైవేటీకరణ ప్రచారంతో మనస్తాపం చెందిన ఉద్యోగి వెంకటేష్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటేష్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్టు ప్రకటించారు. సీఎంతో పాటు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి తదితరులు ఉన్నారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నర్శింగరావు, డీసీఐ నాన్ ఎగ్జిక్యుటివ్ ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటరావు, డీసీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున బిహెచ్ నాయక్ ఉన్నారు.

చిత్రం..ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న చంద్రబాబు