ఆంధ్రప్రదేశ్‌

ముడుపుల భాగోతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 7: పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిర్మించాల్సి ఉండగా ముడుపుల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్మాణ బాధ్యత చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి) ఎంపి వైసి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వైసిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపి సుబ్బారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో కృషిచేసి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించి, కేంద్రం నిర్మాణం చేపట్టి, 2018 నాటికి పూర్తిచేయాల్సివుందని, అయితే ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోవచ్చనిపిస్తోందన్నారు. మరో ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ స్పిల్‌వేలో 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరగాల్సి ఉండగా 4 లక్షల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే జరిగిందని, ఆరు నెలల సమయంలో ఏవిధంగా పూర్తిచేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాపర్ డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభమే కాలేదని, అయితే గ్రావిటీ ద్వారా నీరు ఇస్తానని ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.54 వేల కోట్లకు పెరిగితే కేంద్రం నుండి ఆ మొత్తాన్ని ఎందుకు ఆమోదింపచేసుకోలేక పోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోసు, ఆళ్ల నాని, ఎంపి వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. మొత్తం ముగ్గురు ఎంపిలు, 31 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు.
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
పాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వాసితుల సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యమని వైసిపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించడానికి వచ్చిన వైసీపీ ఎంపిలు, ఎమ్మెల్యేలు ముందుగా నిర్వాసితులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. భూమికి భూమి పథకంలో వ్యవసాయానికి అనుకూలంగా లేని భూమి ఇచ్చారని, ఇళ్లకు అవార్డు అయిపోయినా నష్టపరిహారం ఇప్పటికీ చెల్లించలేదని పలువురు నిర్వాసితులు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు ప్యాకేజీలు ఇవ్వడంలేదని ఆరోపించారు. పోలీసులతో దౌర్జన్యంగా గ్రామాలు ఖాళీ చేయించారని, ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగంచేసిన నిర్వాసితులను అధికారులు అన్యాయం చేశారని వాపోయారు. దీనిపై ఎంపీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తమ నేత జగన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు, నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు ఇక్కడకు వచ్చామన్నారు. నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో అనేకసార్లు ప్రస్తావించామని, నిర్వాసితుల సమస్యలపై పోరాటం చేసి, వారికి న్యాయం చేస్తామని చెప్పారు.
చిత్రం..వైసీపీ నేతలకు ప్రాజెక్టు నిర్మాణ వివరాలు చెబుతున్న ఇంజనీరింగ్ అధికారి