ఆంధ్రప్రదేశ్‌

బీసీల పార్టీ అంటూ వెన్నుపోటు రాజకీయాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 7: బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం జరిగే విధంగా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ వెన్నుపోటు రాజకీయాలు నడపటం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. విజయవాడలో గురువారం జరిగిన సంఘ కార్యవర్గ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. ఈ విషయమై అవసరమైతే ప్రాణత్యాగానికైనా తాను సిద్ధమేనని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కాపులకే మద్దతునివ్వడం బాధాకరం అన్నారు. బీసీల ఓటు ద్వారానే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యారని కృష్ణయ్య విమర్శించారు. ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఏది ఏమైనా నిర్ణయాత్మకంగా ముందుకెళ్లాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు, చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుందన్నారు. రిజర్వేషన్లు కలిపే వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం చెయ్యాలన్నారు. తనకు అన్ని కులాలు సమానమని చెప్పుకునే పవన్ కల్యాణ్.. మంజునాథ కమిషన్ రిపోర్టులోలేని నిర్ణయాన్ని ఎలా సమర్థించారని ప్రశ్నించారు. తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని, బీసీల హక్కుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని మరోసారి అన్నారు. ఈ ప్రభుత్వంపై పోరాడేందుకు బీసీలందరినీ సమాయత్తపరచాల్సిన బాధ్యత నేతలపై ఉందన్నారు. కుల సంఘాల పేరుతో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సూచించారు.