తెలంగాణ

నెలాఖరుకల్లా ప్రజలకు భగీరథ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 7: రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రజలందరికీ రక్షిత మంచి నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేనివిధం గా భగీరథ ప్రయత్నంగా ముఖ్యమంత్రి మిషన్ భగీరథను ప్రారంభించారని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టు వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచి నీటిని సరఫరా చేయాలన్నది మిషన్ భగీరథ ప్రధాన లక్ష్యమన్నారు. ఆరోగ్య తెలంగాణగా మార్చాలన్న ఉద్దేశంతో 40 వేల కోట్ల రూపాయల వ్యయంతో సుమారుగా 20,670 ఆవాసాలలోని కోటి మందికి ఇంటింటికీ నల్లా ద్వారా మంచి నీరు సరఫరా చేయాలన్న ప్రభుత్వ ధ్యేయంతో మిషన్ భగీరథను చేపట్టినట్లు వివరించారు. సింగూర్ నుండి జూక్కల్, బాన్సువాడ, బోదన్ సెగ్మెంట్ పేరు తో రూ.1300 కోట్ల అంచనాలతో 19 మండలాల్లోని 785 గ్రామాలకు రక్షిత మంచి నీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. పనులు పూర్తయిన వెంటనే బల్క్ నీటిని గ్రామాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేసారు. దీంతో జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలలోని అన్ని గ్రామాలకు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మూడు మండలాలకు రక్షిత నీరు అందుతుందన్నారు. సింగూర్ డ్యాం వద్ద సంపులు, ఓహెచ్‌ఆర్‌లు, వాట ర్ ఫిల్టర్‌ల పనులు కొనసాగుతున్నాయన్నారు. 2 ఫిల్టర్ల ద్వారా 1.45 లక్షల మిలియన్ గ్యాలన్ల నీరు శుద్ధి అవుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించామన్నారు. పనులను వేగవంతంగా చేయడంతో పాటు నాణ్యమైన పనులను చేయాల ని సూచించారు. ఈ డిసెంబర్ చివరి నాటికి అన్ని గ్రామాలకు బల్క్ నీటిని ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. అందుకనుగుణంగా డిసెంబర్ 31లోగా పనులు పూర్తి చేసి నీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు రూ.500 కోట్ల చొప్పున వ్యయంతో అంతర్గత (ఇంట్రా) పైపులైన్‌తో నీరందించడానికి ట్యాప్ కనెక్షన్లను ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అనుకున్న సమయంలోగా రక్షిత నీటిని అందించడానికి మిషనరీని, అవసరమైన పని సిబ్బందిని పెంచి నీటిని సరఫరా చేయడానికి చర్యలు చేపట్టామన్నా రు. అంతకుముందు మంత్రి ఇంటెక్‌వెల్, వాటర్ పంపింగి, నీటి శుద్ధి కేంద్రాల పనుల పురోగతిని పరిశీలించారు. కొనసాగుతున్న పనులలో నాణ్యత విషయమై మిషన్ భగీరథ ఎస్‌ఈ డి.రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు.
పనులను వేగవంతంగా పూర్తి చేసి ఆయా నియోజకవర్గాల ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించాలని సూచించారు. మంత్రి పర్యటనలో జిల్లా పరిషత్తు చైర్మన్ దఫెధర్ రాజు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయ ణ, ఎల్లారెడ్డి, జూక్కల్, అందోల్ ఎమ్మెల్యేలు ఏను గు రవీందర్‌రెడ్డి, హన్మంత్ షిండే, బాబుమోహన్, మెగా ప్రాజెక్టు సంస్థ ప్రెసిడెంట్ కె.గోవర్ధన్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ చౌదరిబాబు, డీఈలు లక్ష్మీనారాయణ, వెంకటస్వామి పాల్గొన్నారు.