తెలంగాణ

ముందుకు సాగదు ‘లెండి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 7: దశాబ్దాల కాలం నుండి పెండింగ్‌లో నానుతూ వస్తున్న అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టుకు సమీప భవిష్యత్తులో మోక్షం లభించే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదు. సాగునీటి పథకాల నిర్మాణాలకు పెద్దపీట వేస్తున్న తెరాస ప్రభుత్వ హయాంలోనైనా లెండి పనులు కొలిక్కి వస్తాయని భావిస్తున్న సరిహద్దు ప్రాంత రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. గత ఏడాదిన్నర క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అయిన సందర్భంగా లెండి ప్రాజెక్టు నిర్మాణం అంశాన్ని ప్రస్తావించారు. దీనికి కొనసాగింపుగా మూడు మాసాల అనంతరం ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, సంబంధిత ఉన్నతాధికారులు సమావేశమై లెండి ప్రాజెక్టు పనులపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఒప్పందం పూర్తయి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ, లెండి ప్రాజెక్టు పనుల్లో మాత్రం పురోగతి లేకుండాపోయింది.
ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద 189.73 కోట్ల రూపాయల నిధులను మహారాష్టక్రు చెల్లించింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఏళ్ల తరబడి జాప్యం జరగడంతో అంచనా వ్య యం గణనీయంగా పెరుగగా, ఆ మొత్తాన్ని కూడా చెల్లించేందుకు తెలంగాణ సర్కార్ సంసిద్ధత చూపినప్పటికీ పనులు ముందుకు సాగకపోవడం రైతులను ఉసూరుమనిపిస్తోంది. నిజానికి ఒప్పందం ఖరారైన నాటి నుండి పనులు చేపట్టి ఉంటే 2018 జూన్ నాటికి నిర్దేశిత ఆయకట్టుకు లెండి ప్రాజెక్టు ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందేందుకు ఆస్కారం ఉండేది. కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ముగిసి రెండేళ్లు పూర్తయినా, ఇంతవరకు అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టు పనులు మాత్రం ముం దుకు సాగలేకపోయాయి. దశాబ్దాల కాలం నుండి పెండింగ్‌లో నానుతూ వస్తున్న అంతర్రాష్ట్ర లెండి ప్రాజెక్టు పనులు ఎప్పుడు వేగం పుంజుకుంటాయో, తమ పంటలకు సాగునీరు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని జుక్కల్ నియోజకవర్గ రైతులు భారంగా నిట్టూర్పు విడుస్తున్నారు. మూడున్నర దశాబ్దాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శంకర్‌రావ్ చౌహాన్ లెండి ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో ఈ అంతరాష్ట్ర ప్రాజెక్టుకు 54 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేయగా, ఇరు రాష్ట్రాలు కలిసి ఈ వ్యయాన్ని భరించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లో 22 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అయితే మొదటి నుండి కూడా అరకొర నిధులను మాత్రమే మంజూరు చేస్తుండడంతో దశాబ్దాల కాలంగా లెండి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేకపోయింది. ఎడతెగని జాప్యం జరగడంతో లెండి ప్రాజెక్టు అంచనా వ్యయం పదింతలకు పైగా పెరిగింది. ప్రస్తుతం దాదాపు 560 కోట్ల రూపాయల వరకు వ్యయమవుతుందని తాజాగా అంచనాలు వేశారు. దీనికి గాను తెలంగాణ వాటా కింద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 189.73 కోట్ల నిధులను డిపాజిట్ చేసింది. అయినప్పటికీ, మహారాష్ట్ర సర్కార్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న అక్కడి రైతులకు సరైన నష్టపరిహారం అందించకపోవడంతో రైతులు ఆందోళనకు దిగడం, లెండి నిర్మాణానికి అంతగా చొరవ చూపకపోవడం వల్ల గడిచిన నాలుగైదేళ్ల నుండి లెండి పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రధానంగా ఆర్ అండ్ ఆర్, భూసేకరణ ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొనడం పనుల ప్రగతిపై ప్రభావం కనబరుస్తోందని స్పష్టమవుతోంది. లెండి ప్రాజెక్టుకు సంబంధించి 14 గేట్ల నిర్మాణాలకుగాను ఇప్పటివరకు 10 గేట్లను పూర్తి చేశారు. మరో నాలుగు గేట్ల నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. లెండి ప్రాజెక్టు కాల్వల నిర్మాణాల కోసం జుక్కల్ సెగ్మెంట్‌లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ సింహభాగం పూర్తయింది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య ఇదివరకే ఒప్పందం ఖరారై, పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని నిర్ణయించిన దరిమిలా, లెండి పనుల్లో వేగం పెంచేలా మహారాష్టప్రై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు.

ముందడుగుకు నోచుకోక అసంపూర్తిగా ఉన్న
లెండి ప్రాజెక్టు (ఫైల్ ఫొటో)