సాహితి

మహానగరాలు - మారుమూల పల్లెలు - పాలరాతి శిల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒకానొక ప్రముఖ ఆంగ్లపత్రిక ఫొటోగ్రాఫర్‌గా ప్రపంచంలో చూసిన అనేకానేక దేశాల్లో సైతం ఇంతటి శోభాయమానమయిన ప్రకృతిని తాను చూడలేదనుకున్నాడు- చక్రవర్తి’
అతను న్యూఢిల్లీనుంచి విశాఖపట్టణం వచ్చాడు. అక్కడనుంచి మనోహరమయిన ప్రకృతి దృశ్యాలు చూచుకుంటూ బస్‌లో ప్రయాణం చేశాడు. రోడ్డుప్రక్కన వున్న చింతచెట్టు కింద దిగేశాడు. అతనితోపాటు పాలరాతి శిల్పంలా వున్న ఓ చిన్నారి తల్లి కూడా బస్ దిగి అతనిని చూసీ చూడనట్లుగా ముందుకు సాగిపోయింది. ఓ జుట్టునెరిసిన పెద్దమనిషి సహాయంతో అతను తాను వెళ్లవలసిన యింటికి చేరుకుని, ఆ దివ్య భవనం అనేక ఆధునిక సౌకర్యాలతో విలసిల్లుతున్నదని గమనిస్తాడు. చక్రవర్తి ఆ గ్రామానికి రావడం, ఆ దివ్య భవనాన్ని కట్టించిన ఆసామి ఢిల్లీలో తాను కట్టించిన ఇంటిని అమ్మేస్తాడని తెలుసుకుని- కొనుక్కోవటానికి బేరం కోసం జరుగుతోంది. ‘శ్రీపతి’ వ్రాసిన కథానిక ‘మామిడిపండ్ల ఊరు’ అనే కథలో సన్నివేశం యిది. దీనిలో వైచిత్రియేమంటే- మహానగరం అయిన ఢిల్లీ గురించి, విశాఖపట్టణం సముద్ర తీరంలో వీచే గాలుల గురించి, పల్లె ప్రాంతంలో తనివితీరా కనిపించే ప్రకృతి దృశ్యాల గురించి, మనుషుల మమత అనురాగాల అంతరాల గురించి ఎన్నో ఆహ్లాదకరమయిన విషయాల ప్రస్తావన వస్తుంది. ఇన్ని విషయాలు పోగుచేసుకున్నా, చదవరి కథాగమనం ఏమాత్రం అడ్డు లేకుండా జరుగుతుంది, ఆ యాత్ర మరింత పుష్టికరంగా తయారవుతుంది.
చక్రవర్తి మంచి ఫొటోగ్రాఫర్. అనేక ప్రదర్శనలు ఏర్పరచాడు. అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించాడు. అతను ఇక్కడి పల్లెటూరి వానకు ఎంతో మురిసిపోతాడు. ‘మహాకళాకారుల కుంచెకు సైతం అందని వర్ణ తేజోవైభవంతో కాన్వాసుల మీద దొంతర్లు దొంతర్లుగా తిరుగుతూ ఒయ్యారాలు ఒలుకుతూ ముద్దయిన మనోహర ప్రకృతి చిత్రాలు- చక్రవర్తి వ్యక్తిగత జీవనం బాధాకరం. మూడేళ్ల కిందటనే అతని భార్య శ్రావణి విడాకులు ఇచ్చసి కలకత్తా వెళ్లిపోయింది, కూతురుతో సహా. ఆమె అక్కడ మరో వివాహం కూడా చేసుకున్నదని వర్తమానం. ‘ఓదార్చుతున్నట్లుగా వర్షం తన సహస్ర హస్తాలతో అతని కన్నీళ్లను తుడిచేసింది’!
అనుకున్న పని ఆలస్యం అవుతోంది రుూ మూరుమూల పల్లెలో. అయినా అతనికి ఆలంబనగా ఊళ్ళోని పెద్దమనుషులు కాలక్షేపంగా అనేక కొత్త కొత్త విషయాలు అతనికి అందజేస్తున్నారు. అతనికి బసకోసం యిచ్చిన గది ఫైవ్‌స్టార్ హోటల్ స్థాయిలో ఉంది. ‘గది కిటికీలోనుంచి బయటకు చూస్తే నిండు కాయలతో మామిడిచెట్టు’ కనిపిస్తూ వుంటుంది.
ఆ గ్రామం అంతా ‘నమూనా’గా వుంటుందని అర్థం చేసుకున్నాడు చక్రవర్తి. ‘ఊళ్ళో సమస్యలు వచ్చినపుడు గ్రామ పెద్దలే న్యాయాన్యాయాలు విచారించి తీర్పు చెపుతారట. ఉభయ పక్షాలూ ఆ తీర్పునే పాటిస్తారట... ఆ రెండు రోజుల్లో తోటల్లో తిరగడం, మామిడిపళ్లు- చెరుకురసాలట, సవర్ణరేఖలట, బంగినపల్లి, హిమాం పసందు, నీలం ఎనె్నన్నో రకాలు.. రుచులు, పనసతోటలు, తాటిముంజెలు..’ అతనికి ఆ ఊరి పెద్దమనుషులంతా బంధువులైపోయారు. ‘మూడు పదుల తన జీవితంలో మరచిపోలేని తీయని అనుభూతి’ అయింది రుూ ప్రయాణం అనుకుంటాడు అతను.
తాను కలుసుకోవడానికి వచ్చిన ‘కృష్ణమూర్తి నాయుడు ఢిల్లీలో పెద్ద భవనం కట్టుకున్నాడు. గొప్ప ఉద్యోగం. పలుకుబడి సంపాదించుకున్నాడు. అతను అదంతా వదులుకుని రుూ పల్లెటూరులో స్థిరపడిపోవడం తండ్రికి, ఊళ్లో యితరులకు అబ్బురంగా అతి విచిత్రమయిన పరిణామంగా అనిపిస్తుంది. అయితే కృష్ణమూర్తి నాయుడు ఆలోచనలు వేరు.
చక్రవర్తితోపాటు బస్సుదిగిన అమ్మాయిది అత్తగారి యింట ఆధారం లేని కాపురం. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడట. ఆ తర్వాత ఈమెకు ‘కూతురు’ పుట్టినా కాపురం పంపలేదు. ఊరి పెద్దలంతా కృష్ణమూర్తినాయుడును సంధానం చేసి ఆ సంసారాన్ని నిలబెట్టమని కోరుకోవడానికి వచ్చారు. ‘ఆ పాలరాతి బొమ్మ శిల్పం కళ్ళలో కన్నీళ్ళు బొటబొటా రాలటం పదే పదే గుర్తుకువస్తూన్నది చక్రవర్తికి! చక్రవర్తి ఆ గ్రామాన్ని, తోటలను, పంటలను రకరకాల ఫొటోలు తీసుకున్నాడు. ‘రంగు రంగుల మామిడిపళ్లు, వర్ణశోభ’- ఆ ఫోటోలన్నీ నాలుగు ప్రదర్శనలుగా ఏర్పాటుచేశాడు ఢిల్లీలో. ఈ ఊరిలో కొత్తగా ఏర్పడ్డ స్నేహితులంతా రుూ ప్రదర్శనకు వచ్చి అతని ఆతిథ్యం స్వీకరిస్తారు. ‘వారితో వచ్చింది, తన పాపతో ఆ పాలరాతి శిల్పం, ఢిల్లీలో స్థిరంగా తనతో ఉండిపోవటానికి. ఆ మామిడి పండ్ల ఊరి కనుక తనకి ఈ పాలరాతి శిల్పం అనుకుంటూ ముచ్చట పడతాడు చక్రవర్తి కథాంతంలో. ప్రకృతి వర్ణన, ప్రజల వర్తన, తెగిపోయిన సంసార బంధం ఏ మాత్రం మలినం, శృంగార సంభాషణలు లేకుండా సమాయత్తం అవడం- రుూ కథానికలో కన్నులకు కట్టినట్లుగా చిత్రితం అవుతాయి.

బహిరంగ ప్రేరణతోపాటు అంతరంగ స్ఫూర్తికి అలంకారంగా తయారవుతూ, జీవితాన్ని సుఖమయం చేసుకుందుకు వున్న అవకాశాలు ఎలా కలిసివస్తాయో, వాటిని సదుపయోగం చేసుకోవడంలో మాధుర్యం ఎంత రుచికరంగా వుంటుందో ఆత్మాశ్రయంగా చెప్పే కథానిక యిది. ప్రకృతితో మమేకం అయిపోయే కథలు శ్రీపతి కలం నుంచి అనేకం వచ్చాయి. వాటిలో దిట్ట అయినది ఈ కథ.

09444963584