క్రేజీ అవకాశాలతో నందిత బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్ హీగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన నందిత శే్వతా మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమాతో పలు అవార్డులు కూడా అందుకున్న ఈ భామకు ఆ సినిమా తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు ఎందుకో? దాంతో కోలీవుడ్‌లో ప్రయత్నాలు సాగించిన ఈభామ అక్కడ పలు చిత్రాల్లో నటించింది. తాజాగా మళ్లీ టాలీవుడ్‌లో అవకాశాలు వస్తున్నాయట. ఇప్పటికే రెండు సినిమాలకు ఓకె చెప్పిందట. మంచి కథ కుదరడంతోనే ఈ సినిమాలకు ఓకె చెప్పానని చెప్పింది నందిత. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలబడాలని ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడికి టాలీవుడ్‌లో మరి ఈ సినిమాలతో నిలబడుతుందేమో చూడాలి!