నిజామాబాద్

ఎన్‌ఎస్‌ఎఫ్‌ను వెంటనే తెరిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, డిసెంబర్ 12: ఆసియా ఖండంలోనే పేరుగాంచిన బోధన్ పట్టణంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం వెంటనే తెరిపించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, గత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎన్‌ఎస్‌ఎఫ్‌ను సాధ్వీనం చేసుకుంటామని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీల వర్షం కురిపించడం జరిగిందన్నారు. తెరాస అధికారం చేపట్టి మూడున్నర సంవత్సరాలు కావస్తున్నా, ఎన్‌ఎస్‌ఎఫ్‌ను స్వాధీనం చేసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న ముఖ్యమంత్రి, లేఆఫ్ ప్రకటించి అటు కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. మరోవైపు 80సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి, ఆసియా ఖండంలోనే చెక్కర ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచేందుకు ఆరుగాలం కష్టపడి చెరుకు పండించిన రైతుల కుటుంబాల్లో చేదును మిగిల్చారని ఆరోపించారు. ఎన్‌ఎస్‌ఎఫ్ లేఆఫ్ ప్రకటించి రెండు సంవత్సరాలు కావస్తున్నా, దీని విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. కల్లిబొల్లి మాటలతో కాలం వెళ్లదీయకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వెంటనే ఎన్‌ఎస్‌ఎఫ్‌ను స్వాధీనం చేసుకుని, పునఃప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తెరాసకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు, రైతులు, కార్మిక లోకం సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ నాయకులు న్యావనంది గోపాల్, ఉప్పు సురేష్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు సాహిత్య రంగంలో ప్రతి ఒక్కరూ ప్రతిభ చూపాలి
*ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్

కామారెడ్డి, డిసెంబర్ 12: తెలుగు సాహిత్య రంగంలో ప్రతి ఒక్కరు తమ ప్రతిభను చూపాలని ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగు పండితుల సన్మాన కార్యక్రమంలో తెలుగు పండితులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో పాటు ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్‌ను ఈ సందర్భంగా సన్మానించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విప్ మాట్లాడుతూ, ప్రపంచంలో అందరికీ నచ్చిన భాష తెలుగు భాష అని ఈ భాష గొప్పదనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తుందని అన్నారు. ఇక నుండి తెలుగుకు ముందు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇరు రాష్ట్రాల తెలుగు బాషకు ప్రపంచలో మంచి గుర్తింపు ఉందని, తెలుగు భాష తియ్యదనాన్ని ప్రపంచం మొత్తం చాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రపంచ మహాసభలకు మంచి స్పందన లభిస్తోందని అన్నారు. తెలుగు పండితులు విద్యార్థులకు తెలుగులోని కమ్మదన రుచిని చూపించాలని అన్నారు. ప్రతి విద్యార్థి తెలుగుభాషపై మమకారం పెంచుకునేలా చూసే బాధ్యత తెలుగుపండితులపై ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు తెలుగు భాష గొప్పదనాన్ని ఈ ఉత్సవాలతో చాటి చెప్పాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు భాష అంటే అందరికి ఇష్టమేనని అన్నారు. ఈ నెల 15నుండి ప్రారంభం అయ్యే ప్రపంచ మహాసభలకు ఆసక్తి ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు డ్రెస్‌కోడ్ పాటించాలని అన్నారు. ఈకార్యక్రమంలో కర్షక్ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ రషీద్, డిఇఓ మదన్‌మోహన్, మనోహర్‌తో పాటు తెలుగుపండితులు పాల్గొన్నారు.