క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్‌లో అజరెన్కాకు వైల్డ్‌కార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, డిసెంబర్ 13: గతంలో రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన విక్టోరియా అజరెన్కా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వచ్చేనెల జరిగే ఈ మెగా టోర్నీలో ఆడేందుకు ఆమెకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. బెలారస్‌కు చెందిన ఈ ప్రపంచ మాజీ నంబర్ వన్ గత ఏడాది మగ పిల్లాడు, లియోకు జన్మనిచ్చింది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఆ పసివాడు ఎవరి వద్ద ఉండాలన్న కేసు విచారణకు వచ్చింది. లియో తండ్రి బిల్లీ మెక్‌కీగ్‌తో ఉన్న గొడవలు చివరికి కోర్టు వరకూ వెళ్లాయి. యుఎస్ ఓపెన్ సమయంలో పిల్లాడిని తన వెంట తీసుకెళ్లడానికి వీల్లేదంటూ అజరెన్కాను కోర్టు ఆదేశించడంతో, ఆమె ఆ టోర్నీ నుంచి వైదొలగింది. ఈ కేసు ఇంకా పరిష్కారం కాలేదు. అయితే, ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు వీలుగా ఆమెకు సాయంగా నిలుస్తామని టోర్నమెంట్ డైరెక్టర్ క్రెగ్ టిల్లే తెలిపాడు. అందుకే, ఆమెకు వైల్డ్‌కార్డ్‌ను జారీ చేశామని చెప్పాడు.