క్రీడాభూమి

క్రికెటర్ల ముసుగులో పర్యాటకులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, డిసెంబర్ 13: నైట్ క్లబ్‌లో పీకలదాకా తాగి, అంతటితో ఊరుకోకుండా పేసర్ జేమ్స్ ఆండర్సన్‌పై బెన్ డకెట్ బీరును కుమ్మరించిన సంఘటనపై ఆస్ట్రేలియా మీడియా విమర్శలు గుప్పిస్తున్నది. ఐదు మ్యాచ్‌ల ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల్లోనూ పరాజయాలను చవిచూసిన ఇంగ్లాండ్ గురువారం నుంచి పెర్త్‌లో మొదలయ్యే మూడో టెస్టులోనూ ఓడితే, సిరీస్‌ను కోల్పోతుంది. తొలి టెస్టులో ఎదురుదెబ్బ తగిలిన వెంటనే ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఇంగ్లాండ్ క్రికెటర్లు పర్యాటనకు వచ్చిన వారిలా క్లబ్‌లు, పబ్‌లు పట్టుకొని తిరగడం ఏమిటని ఆసీస్ మీడియా నిలదీస్తున్నది. క్రికెటర్ల ముసుగులో పర్యాటకులే ఆస్ట్రేలియా వచ్చి ఉంటారేమోనని కొన్ని పత్రికలు ఎద్దేవా చేశాయి. స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ స్వదేశంలో ఒక బార్ వద్ద ఘర్షణకు దిగిన సంఘటనను మరికొన్ని పత్రికలు ప్రధానంగా ప్రస్తావించాయి. ఆ కేసు విచారణను ఎదుర్కొంటున్న కారణంగా, యాషెస్ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ స్టోక్స్ మిగతా సభ్యులతో కలిసి ఆస్ట్రేలియాకు రాలేకపోయాడు. కాగా, ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టో తలతో ఢీకొడుతూ ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను పలకరించడంపై ఇది వరకే స్థానిక మీడియా విమర్శలు గుప్పించింది. తాజాగా డకెట్ ఉదంతం పాత్రికేయులకు ప్రత్యేక కథనాలను తయారు చేసుకునే అవకాశం కల్పించింది. ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లను క్రికెటర్లు అనేకంటే, పర్యాటకులు అనడమే బాగుంటుందని ఒక పత్రిక తీవ్ర స్థాయిలో విమర్శించింది. ఇకనైనా అంకిత భావంతో మ్యాచ్‌లు ఆడాలని హితవు పలికింది.