ఆంధ్రప్రదేశ్‌

పీఆర్సీ బకాయిలు, డీఏ మంజూరు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంజూరు చేయవలసిన రెండు విడతల డీఏ బకాయిలను నూతన సంవత్సర కానుకగా వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ బకాయిల చెల్లింపునకు షెడ్యూలు ఖరారు చేయాలని ఏపీ ఎన్‌జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ ఛైర్మన్ పి.అశోక్ బాబు నేతృత్వంలో ఎన్జీవో సంఘ నాయకులు పలువురు బుధవారం ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిని కలిసి ఉద్యోగుల డిమాండ్లపై చర్చించారు. కాకినాడలో బుధవారం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని ఆయన స్వగృహంలో ఉద్యోగ సంఘాల నాయకులు కలిశారు. ముఖ్యంగా ఉద్యోగులకు వేతన సవరణ బకాయిలను చెల్లించేందుకు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని గత మూడున్నర సంవత్సరాలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముఖ్యంగా పెన్షనర్లు ఈ విషయంపై ఆందోళనగా ఉన్న విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే బకాయి ఉన్న రెండు విడతల డీఏ బకాయిలను విడుదల చేయాలని, నూతన పీఆర్సీ బకాయికి చర్యలు తీసుకోవాలని అశోక్ బాబు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఉద్యోగుల డిమాండ్లపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులకు సంబంధించిన అన్ని డిమాండ్లను నెరవేరుస్తున్నారు. ఉద్యోగులకు పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు విడుదల వంటి విషయాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారన్నారు. పీఆర్సీ బకాయిల విడుదల షెడ్యూలు ఖరారుకు ఉన్నతాధికారులు, ఎన్జీవో నేతలపై 26వ తేదీన సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. సమావేశంలో కూలంకుషంగా చర్చించి బకాయిల చెల్లింపుకు నిర్ణయం ప్రకటిస్తామని వివరించారు. నూతన పీఆర్సీ నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ శాఖలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేసుకుంటూ వెళ్తామని మంత్రి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఎన్జీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, బి.ఆశీర్వాదం, తదితరులు ఉన్నారు.