ఆంధ్రప్రదేశ్‌

వెయ్యి విపత్తులొచ్చినా సిద్ధం: డీజీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 20: తుపానులు, వరదలు వంటి విపత్తు సమయాల్లో అవసరమైన రక్షణ, సహాయక చర్యలు అందించేందుకు ప్రతినిత్యం సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. వెయ్యి విపత్తులు సంభవించినా ప్రజలను రక్షించేందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు ‘స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్’, ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు ఉన్నాయన్నారు. ఏపిఎస్‌పి బెటాలియన్, అగ్నిమాపక శాఖ సిబ్బందికి గత పదిరోజులుగా నిర్వహిస్తున్న ‘అడ్వాన్స్ టెక్నికల్ ట్రైనింగ్’ కోర్సు ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ సహకారంతో.. పూనేకు చెందిన ఐటియుఎస్ అనే ప్రైవేటు సంస్థ ఈ శిక్షణ అందించింది. ముగింపు సందర్భంగా ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కృష్ణవేణి మోటెల్ వద్ద బకింగ్ హాం కెనాల్‌లో ఏపి స్టేట్ డిజాస్కర్ రెస్క్యూ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించాయి. నీటి విపత్తులు సంభవించినప్పుడు, ప్రమాదాల్లో చిక్కుకుని కొట్టుకుపోతున్న ప్రజలను రక్షించేందుకు రంగంలోకి దిగి తీసుకునే చర్యలు, స్విమ్మింగ్ అండ్ డై రెస్క్యూ, బోటు రెస్క్యూ, రోప్ రెస్క్యూ, మాస్ రెస్క్యూ వంటి విన్యాసాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై వీక్షించిన డీజీపీ అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్‌కు సంబంధించి ఆరు కంపెనీలను ప్రభుత్వం ఇదివరకే మంజూరు చేసిందని, విపత్తు సమయాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్‌తో కలిసి పని చేస్తామన్నారు. బెటాలియన్ సిబ్బందితోపాటు ఫైర్ సిబ్బంది కలిపి మొత్తం 50మంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌లో ఉన్నారన్నారు. ఇందుకోసం ప్రపంచబ్యాంకు నిధులు 17కోట్లు ఖర్చు చేసి కావాల్సిన పరికరాలు, సామాగ్రి కొనుగోలు చేసినట్లు చెప్పారు. 16రోజుల శిక్షణ పొందిన బృందాల సాహస కృత్యాలు అభినందనీయమన్నారు. ఉరకలు వేస్తూ పారుతున్న నీటిలో రెస్క్యూ చేయడం ఎంత కష్టమో తెలుస్తోందన్నారు. అనంతరం బెటాలియన్, ఫైర్ సిబ్బందికి సర్ట్ఫికెట్లు, మెడల్స్ అందచేసిన డీజీపీ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ డీజీ సత్యనారాయణ, జయరాం నాయక్, ఆర్‌కే మీనా తదితరులు పాల్గొన్నారు.