విజయవాడ

1578 మందికి జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 21: నగరంలో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారిపై చట్టపరంగా చర్యలు తప్పవని మరోసారి డీసీపీ క్రాంతిరానా టాటా హెచ్చరించారు. ఇదే సమయంలో హెల్మెట్‌పై నిరంతర అవగాహన కూడా కల్పించే కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేపట్టారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 1578 వాహనాలు తనిఖీ చేసి, 24 వాహనాలను సీజ్ చేశారు. సీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో రోడ్డెక్కిన ట్రాఫిక్ యంత్రాంగం డీసీపీ రానా నేతృత్వంలో నగరంలోని వివిధ కూడళ్లలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు తనిఖీలు జరిపారు. సీతమ్మవారి పాదాల, సితార జంక్షన్, వైవీ రావు ఎస్టేట్, ఆలిండియా రేడియో స్టేషన్, విజయకృష్ణా సూపర్ బజార్, అలంకార్ జంక్షన్, ఫుడ్ జంక్షన్, ఎన్టీఆర్ సర్కిల్, హోటల్ డీవీ మేనర్ సెంటర్, రామవరప్పాడు రింగ్, కామయ్యతోపు సెంటర్, తదితరచోట్ల వాహనాలు నిలిపి హెల్మెట్ లేని వారిపై చర్యలకు ఉపక్రమించారు. హెల్మెట్ లేకుండా పట్టుబడిన 1578 వాహనదారులకు జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా మరోసారి పట్టుబడితే వాహనం సీజ్ చేసి చట్టపరమై చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో ట్రాఫిక్ అదనపు డీసీపీ టీవీ నాగరాజు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.