కృష్ణ

పారిశుద్ధ్య కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 21: జీవో నెం. 279ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పురపాలక సంఘ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య పనివార్ల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. నాల్గవ రోజైన గురువారం పారిశుద్ధ్య కార్మికులు పురపాలక సంఘ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన ద్వారా తమ నిరసన తెలియజేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. వీరి ఆందోళన కార్యక్రమానికి సీఐటీయు, ఎఐటీయుసి ప్రతినిధులు నాయకత్వం వహించారు.

కృష్ణా వర్సిటీ హాకీ జట్టు ఎంపిక
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 21: స్థానిక ఆంధ్ర జాతీయ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న హాకీ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం కృష్ణా విశ్వవిద్యాలయం హాకీ జట్టును గురువారం ఎంపిక చేశారు. విజయవాడ, నున్న, మచిలీపట్నంకు చెందిన 16 మంది విద్యార్థులతో జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన జట్టు జనవరి 22వతేదీ నుండి బెంగుళూరు విశ్వవిద్యాలయంలో జరిగే సౌత్ జోన్ అంతర్ విశ్వ విద్యాలయాల హాకీ టోర్నమెంట్‌లో పాల్గొననున్నట్లు విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. ఎంపిక కార్యక్రమంలో ఎజె కళాశాల ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డా. పిజె కుటుంబరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రవణం రామకృష్ణ, జగ్గయ్యపేట ఎస్‌జీఎస్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం స్వామి, వికాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ ఎ చినబాబు పాల్గొన్నారు.
కృష్ణా వర్సిటీ హాకీ చాంప్ వికాస్ కాలేజ్
విజయవాడ (స్పోర్ట్స్): కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల హాకీ టోర్నమెంట్‌లో నున్నకు చెందిన వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హాకీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా గురువారం కళాశాలలో అభినందన కార్యక్రమం జరిగింది.