కృష్ణ

డా. పట్ట్భా గ్రామీణాభివృద్ధి సంస్థ సేవలు అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 21: ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన సంస్థ డా. పట్ట్భా గ్రామీణాభివృద్ధి సంస్థ అని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. డా. పట్ట్భా గ్రామీణాభివృద్ధి సంస్థ 160 వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ బాబాప్రసాద్ మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 13వేల 778 మందికి వివిధ చేతి వృత్తుల్లో శిక్షణ ఇప్పించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్, ప్రముఖ వైద్యుడు డా. బి ధన్వంతరి ఆచార్య తదితరులు పాల్గొన్నారు.

రహదారి భద్రత నియమాలతోనే ప్రమాదాల నివారణ
పెడన, డిసెంబర్ 21: ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) పి సీతాపతిరావు అన్నారు. నందమూరు వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఎల్‌ఎల్‌ఆర్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీతాపతిరావు రహదారి భద్రతా నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు అర్హులన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ కుమార్ బాబు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తమ్మన సాయికుమార్, డి బాబా, ప్రిన్సిపాల్ డా. ఎబి శ్రీనివాసరావు, గుడివాడ అసిస్టెంట్ ఎంవీఐ ఎన్‌ఎల్‌ఎస్ లక్ష్మి, షేక్ అబ్దుల్ లతీఫ్, ఎం క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.