కృష్ణ

రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, డిసెంబర్ 21: రైతాంగ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెడన నియోజకవర్గ శాసనసభ్యుడు కాగిత వెంకట్రావ్ అన్నారు. గురువారం మల్లేశ్వరం మార్కెట్ యార్డు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కాగిత మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. పట్టిసీమ ద్వారా డెల్టా శివారు భూముల్లో సిరులు కురిసే విధంగా ఈ యేడాది ఖరీఫ్ సాగు జరిగిందన్నారు. అనంతరం మార్కెట్ యార్డు చైర్మన్‌గా కృత్తివెన్ను మాజీ ఎంపీపీ గుడిశేవ మహాలక్ష్మి, వైస్ చైర్మన్‌గా ఎండీ అమీర్, డైరెక్టర్లుగా కందుల చాముండేశ్వరి, ఏకుల నాగపోతురాజు, కానూరి క్రాంతి కుమార్, ఉమ్మిడిశెట్టి చిన వెంకటేశ్వరరావు, రాజులపాటి సుబ్బారావు, గుడిశేవ వీరాస్వామి, కండవల్లి వెంకటేశ్వరరావు, శెట్టి కాసులు, దాసరి బాలయేసు, పుప్పాల పాండు రంగారావు, అల్లూరి సత్యనారాయణ, కొల్లా శ్రీనివాసరావు, చక్కా మోసన్ దాస్ కరంచంద్ గాంధి, పర్ణం సూర్యప్రకాశరావు, యిల్లూరి పద్మజలచే ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు కాగిత కృష్ణప్రసాద్, గూడూరు మాజీ జెడ్పీటీసీ బూరగడ్డ శ్రీకుమార్, కృత్తివెన్ను, గూడూరు ఎంపీపీలు వలవల సత్యనారాయణ, కాసగాని శ్రీనివాసరావు, బంటుమిల్లి, కృత్తివెన్ను జెడ్పీటీసీలు దాసరి కరుణజ్యోతి, ఒడుగు తులసీరావు, బంటుమిల్లి మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు పాలడుగుల వీర వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు యిల్లూరి లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యం: జోగి రమేష్
మైలవరం, డిసెంబర్ 21: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు గురువారం ఇక్కడ పోటాపోటీగా నిర్వహించారు. తొలుత స్థానిక ఎల్‌హెచ్ రెడ్డి కాంప్లెక్స్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేకును వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్ కట్‌చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్థానిక మూడు విగ్రహాల సెంటర్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో, మండలంలోని వెల్వడంలో లకిరెడ్డి బాలిరెడ్డి ఇంట ఏర్పాటు చేసిన భారీ కేకులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ జోగి రమేష్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంపిణీ చేశారు. కార్యకర్తలు పెద్దఎత్తున బాణాసంచా కాల్చి, ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దివంగత నేతలు చనమోలు వెంకట్రావ్, రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి దిశ-దశ జగన్‌తోనే సాధ్యమన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతితో కూడిన రాజన్నరాజ్యం ఆయన తనయుడు జగన్ సారధ్యంలోనే నెరవేరుతుందన్నారు. జగన్ చేస్తున్న ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలనుండి అనూహ్యమైన స్పందన లభిస్తుందని ఆయన పాదయాత్రకు లభిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు పామర్తి శ్రీనివాసరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ కరీమ్, ఎంపిటిసి రహీమ్, జి కొండూరు ఎంపిపి వేములకొండి తిరుపతిరావు, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.