కడప

విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, డిసెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యబివృద్ధి సంస్థ (ఎపియస్‌యస్‌డిసి) ఆద్వర్యంలో స్థానిక రాణీతిరుమలదేవి కళాశాలలో ఇంటర్‌మీడియట్ విద్యార్థులకు గురువారం జాబ్‌మేళా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏపియస్‌యస్‌డిసి జిల్లా సమన్వయ కర్త సంపత్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పారిశ్రామిక వ్యక్తులుగు ఎదిగేందుకు ఔత్సాహితులకు ప్రొద్దుటూరులో త్వరలో వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. ఎక్కడికైనా వెళ్లి ఉద్యోగాలు చేసేందుకు సిద్దంగా వుండాలన్నారు. గురు, శుక్రవారాలలో నియమకాలు జరుగుతాయని అన్నారు. కళాశాలకు చెందిన ప్లేస్‌మెంట్ ఆఫీసర్లు రవిశేఖర్ మాట్లాడుతూ రాత పరీక్ష సైకో, మెట్రీక్ టెస్ట్, స్కిల్స్ టెస్ట్, వైద్య పరీక్షలు నిర్వహించామని ఈ పరీక్షలో 20 మంది ఎంపికయ్యారన్నారు. వీరికి శుక్రవారం గ్రూప్ డిస్క్‌క్షన్, పర్సనల్ ఇంటర్యూలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండ్‌ట్ ధరణీంద్రా, ప్రిన్స్‌పల్ చంద్రశేఖర్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

డాక్యుమెంట్లు అందించండి
ఖాజీపేట, డిసెంబర్ 21: గండికోట ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగ భూ నిర్వాసితులైన కొండాపురం గ్రామప్రజలు తమ డాక్యుమెంట్లు, ఆధారాలను అధికారులకు అందిస్తే పరిహా రం ఇవ్వనున్నట్లు కలెక్టర్ టి.బాబూరావునాయుడు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మీ-కోసం హాల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పునరావాస వినతుల కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హాజరైన నిర్వాసితులతో మాట్లాడారు. వినతులు అందించేందుకు వచ్చిన కొండాపురం గ్రామప్రజలకు గతంలోనే పరిహారం అందించా మన్నారు. అప్ప ట్లో పరిహారం పొంద క మిగిలిన వారు ఎవరైనా ఉంటే వారి అర్జీలు స్వీకరించేందుకు ఈ కార్యక్ర మం ఎంతగానో ఉపయోగపడునున్నట్లు తెలిపారు. పరిహారం చెల్లింపునకు సంబంధించి ఆధారాలు, అర్హత లు ఖచ్చితమైన డాక్యుమెంట్లు సమర్పించిన వారి దరఖాస్తులు పరిశీలించి తగున్యాయం చేస్తామన్నారు. అర్హతలున్నవారికి ఎలాంటి అన్యా యం జరగదని క్లైమ్ సరైన పక్షంలో అర్హత మేరకు తప్పక పరిహారం చెల్లిస్తామన్నారు. బాధితులంతా సమన్వయం పాటించి డాక్యుమెంట్లు చూపించి పరిహారం పొందాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక కలెక్టర్ నాగేశ్వరరావు, డీఆర్వో బాబయ్య, జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న, పరిపాలనాధికారి శ్రీనివాసులు, రెవెన్యు సిబ్బంది పాల్గొన్నారు.