చిత్తూరు

భాకరాపేట అటవీ ప్రాంతంలో ముగ్గురు స్మగ్లర్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నగొట్టిగల్లు, డిసెంబర్ 21: భాకరాపేట అటవీప్రాంతంలో ఎస్వీ నేషనల్‌పార్క్, చామలరేంజ్, తలకోన బీటు, ముళ్లగుట్ట ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ చేస్తున్న సందర్భంగా ముగ్గురు తమిళ స్మగ్లర్లను, రూ. 25 లక్షలువిలువ చేసే 550 కేజీల బరువున్న 14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు భాకరాపేట అటవీశాఖాధికారి రఘునాథ్ వెల్లడించారు. గురువారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ తిరుపతి వైల్డ్ లైఫ్ డిఎఫ్‌ఓ ఫణికుమార్ ఆదేశాల మేరకు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో15 మంది స్మగ్లర్లు దుంగలను తరలిస్తుండగా గుర్తించామన్నారు. లొంగిపోవాలని హెచ్చరించామని, దీంతో దుంగలను వదిలి స్మగ్లర్లు పారిపోయారన్నారు. ఈక్రమంలో గోవింద స్వామి (30), గోవిందన్ సెల్వం(31) అప్పాస్వామి సుందరమూర్తి (28)లను పట్టుకున్నామన్నారు. ఈసందర్భంగా వారు వదిలివెళ్లిన దుంగలను స్వాధీనం చేసుకున్నామని, పారిపోయిన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామని చెప్పారు. పట్టుబడ్డవారిని పీలేరుకోర్టు మందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఓ వేణు, నెరబైలు ఎఫ్‌బిఓ వందన్‌కుమార్, వినోద్‌కుమార్, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు.

ఐషర్ వాహనం ఢీకొని విద్యార్థినికి తీవ్రగాయాలు
* పరిస్థితి విషమం
బి. కొత్తకోట, డిసెంబర్ 21: పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఐషర్ వాహనం ఢీకొనడంతో దివ్య అనే విద్యార్థిని (15) గాయపడ్డ సంఘటన గురువారం పెద్దతిప్ప సముద్రం, పులికల్లు పంచాయతీ, బొంతలవారి పల్లెలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బొంతవారి పల్లెకు చెందిన శివరామిరెడ్డి అనే రైతు కుమార్తె దివ్య పులికల్లు జడ్పీ హైస్కూల్లో చదువుతోంది. 10వ తరగతి చదువుతున్న బధిర విద్యార్థి అయిన దివ్య పాఠశాల ముగియడంతో బస్సులో స్వగ్రామం వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. అదే సమయంలో మద్దయ్యగారిపల్లెనుంచి వేగంగా వచ్చిన ఐషర్ కెఏ 02 3337 వాహనం ఢీకొనింది. దీంతో తలపై తీవ్రగాయమైన దివ్య కేకలు వేయడానికి కూడా నోటిమాటరాక పడిపోయింది. ఈప్రమాదాన్ని గమనించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన వాహనంలోనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.