చిత్తూరు

సద్దికూడు మడుగులో పడి యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగలాపురం, డిసెంబర్ 21: మండల పరిధిలోని జంబుకేశవపురం సమీపంలో ఉన్న సద్దికూడు మడుగులో పడి యువకుడు మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం మేరకు సద్దికూడు మడుగులో విహారయాత్రకు చెన్నై నుంచి శెల్వం (23) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి వచ్చారు. అక్కడ సరదాగా గడుపుతూ స్నానం చేయడానికి మడుగులోకి దిగడంతో శెల్వంకు ఈత రాక నీళ్లలో మునిగిపోయాడు. దీంతో అతని స్నేహితులు శెల్వంను బయటకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. స్థానికుల సహాయంతో ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేయడంతో వారు శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడుకు తరలించారు. దీంతో శెల్వం తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సద్దికూడు మడుగులో ఇలాంటి సంఘటనలు పలుమార్లు జరుగుతున్నా దీనిపై స్థానిక పోలీసులుకానీ, అధికారులు కానీ ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాస్టర్ ప్లాన్‌
* దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు వెల్లడి
శ్రీకాళహస్తి, డిసెంబర్ 21: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మాస్టర్ ప్లాన్‌ను రాబోయే 18 నెలల్లో అమలుచేసి తీరతామని రాష్ట్ర దేవాదాయశాఖామంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించారు. గురువారం శ్రీకాళహస్తికి వచ్చిన ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మాస్టర్‌ప్లాన్‌ను అమలుచేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, 18నెలల్లో అమలుచేస్తామని చెప్పారు. బాధితులకు రెవెన్యూ అధికారుల అంచనా ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఈఓపై కొందరు పీఠాధిపతులు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈ ఆలయంలో అవినీతి చోటుచేసుకుంటున్నదని, ప్రసాదాలు నాణ్యతగా లేవని, అన్నదానం సక్రమంగా జరగడం లేదని, సరుకుల కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని కొందరు పీఠాధిపతులు ఆరోపణలు చేసినదానిపై మంత్రి స్పందించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. దేవాదాయ శాఖకు చెందిన కొందరు అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు జరిగాయని, మరికొందరిపై కూడా దాడులు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. అవినీతి అధికారులకు శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న తరువాత దక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వదించారు. ఈఓ భ్రమరాంబ తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఒడిశా రాష్ట్రానికి చెందిన యువకుడి ఆత్మహత్య
రేణిగుంట, డిసెంబర్ 21: వేణుగోపాలపురం శ్మశాన వాటికలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రేమ్ హరిజన్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం విద్యుత్ స్తంభం సపోర్టింగ్ వైర్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అతను ఒడిశా రాష్ట్రానికి చెందిన వాడని గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు.