అనంతపురం

జగన్‌కు అడుగడుగునా ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి టౌన్, డిసెంబర్ 23: వైకాపా అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం కదిరికి చేరుకుంది. 42వ రోజు ప్రజా సంకల్పయాత్ర తొలుత నల్లమాడ మండలం బొగ్గలపల్లి నుండి ఉదయం 8.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమై కదిరి నియోజకవర్గం యాకాలచెరువు కొత్తపల్లిలో 9 గంటలకు జగన్ పాదయాత్ర చేరుకోగా ఆయనకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా. పీవీ సిద్దారెడ్డి, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తల హరిప్రసాద్, పూల శ్రీనివాసరెడ్డి, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు జగన్‌పై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. యాకాలచెరువుపల్లి వద్ద ఏడీసీసీ ఛైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు జగన్‌కు మంగళహారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం శివశంకర్‌రెడ్డి జగన్ చేతులమీదుగా వృద్ధులకు చీరలు పంపిణీ చేయించారు. సంకల్పయాత్రలో వృద్ధులు, రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థి సంఘం నాయకులు జగన్‌ను కలిసేందుకు ఎగబడ్డారు. మారుమూల గ్రామాల నుండి ప్రజలు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు. యువత జగన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ముందుకొచ్చారు. జగన్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారికి సెల్ఫీ అవకాశం కల్పించారు. పాదయాత్రలో గిరిజన సంఘం నాయకులు క్రిష్ణా నాయక్, రాంప్రసాద్ నాయక్, శ్రీనివాసులు నాయక్ కలిసి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చరాదని జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. వేమన అధ్యాయన కమిటీ అధ్యక్షులు శరత్‌కుమార్‌రెడ్డి జగన్‌కు వినతిపత్రం సమర్పిస్తూ కదిరి పట్టణానికి రింగు రోడ్డు ఏర్పాటుకు కృషి చేయడంతోపాటు రైతులు పండించిన వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమలు ఏర్పాటుచేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తిమ్మమ్మ మర్రిమాను, యోగి వేమన ఆలయం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రజా సంకల్పయాత్ర కొండమనాయునిపాళ్యం, వరిగిరెడ్డిపల్లి, గట్లతండా, గట్లు క్రాస్, పార్థసారథి కాలనీ, వీవర్స్ కాలనీ, కోనేరు సర్కిల్, హిందూపురం క్రాస్, టవర్ క్లాక్ కూడలి, మున్సిపాల్టీ మీదుగా ఇందిరాగాంధీ సర్కిల్‌కు చేరుకుంది. అడుగడుగునా జన నేత జగన్‌కు జనం నీరాజనం పలికారు. జగన్‌ను ఉరవకొండ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, వైకాపా జిల్లా కన్వీనర్ శంకర్‌నారాయణ, చవ్వా రాజశేఖరరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, మోహన్‌రెడ్డిలు జగన్ వెంట పాదయాత్రలో నడిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ఫర్హానా ఫయాజ్, పట్టణాధ్యక్షుడు కేయస్ బహావుద్దీన్, రూరల్ కన్వీనర్ ప్రకాష్, నాయకులు లింగాల లోకేశ్వరరెడ్డి, మార్కెట్ నౌషాద్, సీఎం షఫి, వైకాపా కౌన్సిలర్లు రాజశేఖరరెడ్డి, జగన్, కినె్నర కళ్యాణ్, ఖాదర్‌బాషా, గంగాధర్, కొలిమి జిలాన్, అబు బకర్, క్రిష్ణవేణి, సమీవుల్లా, అషఫ్ అలీ, నాగమల్లు, వెంకటనారాయణరెడ్డి, శాంతమ్మ, క్రిష్ణవేణి, శంకర, కొమ్మెద్ది అప్పల్ల తదితరులు ఉన్నారు.
సమస్యలు పరిష్కరించండి..
* కలెక్టర్‌కు పీసీసీ అధ్యక్షుడు రఘువీరా విన్నపం
అనంతపురం సిటీ, డిసెంబర్ 23: రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శనివారం జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై కలెక్టర్ వీరపాండ్యన్‌ను ఆయన ఛాంబర్‌లో కలసి జిల్లాలోని ప్రజలకు మీకోసం, ఇతర మాద్యమాల ద్వారా అందించిన సమస్యలను జన్మభూమి కార్యక్రమం ప్రారంభించేలోపు పరిష్కరించాలని కోరారు. అనంతరం రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ మడకశిర, కళ్యాణదుర్గం, పెనుకొండ నియోజకవర్గాల పరిధిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నామని తెలిపారు. ప్రజలకు రేషన్ కార్డులు, పింఛన్లు, పంట నష్టపరిహారం, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి హామీ బిల్లులు రాక వేలాది మంది పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని తెలిపారు. ప్రజల తమ సమస్యలను మీకోసం, ప్రచార మాధ్యమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని, కాని ప్రభుత్వం వాటిని పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు కేవలం అధికార పార్టీ నాయకులకే అందుతున్నాయని ఆరోపించారు. టీడీపీ నాయకులకు తప్పా ఇతర పార్టీల వారికి ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారని, ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను తీర్చకుండా జన్మభూమి, ఇతర కార్యకలాపాలతో సమయాన్ని వృథా చేస్తోందన్నారు. వచ్చే సంవత్సరంలో ప్రారంభమయ్యే జన్మభూమిలోపు ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఉద్యమాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం, నగర అధ్యక్షుడు దాదాగాంధీ, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.