అనంతపురం

చంద్రన్న మాల్స్ పేర దోపిడీకి తెరలేపిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, డిసెంబర్ 23: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో పేదలకు ఇస్తున్న సరుకులను పూర్తిగా తగ్గించిన చంద్రబాబు చంద్రన్న మాల్స్ పేర దోపిడీకి తెరలేపారని వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం కదిరిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి రాక ముందు రేషన్ షాపుల్లో బియ్యం, ఉప్పు, పప్పు, చక్కెర, చింతపండు, పామోలిన్, కిరోసిన్‌వంటి నిత్యావసర సరుకులు రూ. 186లకే ఇస్తుండేవారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తొలగించి కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారన్నారన్నారు. తన షేర్లు వున్న ఫ్యూచర్స్, రిలయన్స్‌తో ఒప్పందం కుదుర్చుకొని చంద్రన్న మాల్స్ పేరుతో దోపిడీకి తెరలేపారన్నారు. చంద్రన్న మాల్స్‌లో మార్కెట్ ధరకంటే 40 శాతం తక్కువ నిత్యావసర వస్తువులు దొరుకుతాయని, మంత్రుల చేత అబద్ధపు హామీలు చెబుతున్నారన్నారు. ఎన్నికలకు ముందు కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయంటూ విమర్శించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ. 60లు వచ్చే బిల్లును మూడు రెట్లు పెంచి రూ. 500లు బిల్లు వచ్చేలా కరెంట్ బిల్లులతో షాక్ కొట్టిస్తున్నారన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఈ నాలుగేళ్లలో అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని, ప్రజలు చంద్రబాబును క్షమిస్తే వచ్చే ఎన్నికల్లో ఇంటికి కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని మోసం చేయడం ఖాయమన్నారు. దేవుడు దయతలచి, ప్రజలు ఆశీర్వదిస్తే తాము అధికారంలోకి వస్తే పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు రూ. 1000 బిల్లు దాటిన ప్రతి రోగానికి, ప్రతి ఆపరేషన్‌కు తామే డబ్బు చెల్లించడంతోపాటు ఆ రోగికి ఎన్ని నెలలు విశ్రాంతి అవసరమో అన్ని రోజులు ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం అందిస్తామన్నారు. దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్న వారికి రూ. 10 వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. 102 ద్వారా పేదలకే కాకుండా పశువులకు కూడా ఉచితంగా వైద్యసేవలు అందిస్తామని చెప్పారు.
కదిరిలో రింగు రోడ్డు వేయిస్తానని, తనకల్లులో డిగ్రీ కళాశాల, కదిరిలో ప్రెస్‌క్లబ్ నిర్మాణం చేపడుతామని ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదిరిలో మంచినీటి సమస్య తెలుసుకొని పార్నపల్లి ద్వారా నీరు తీసుకొచ్చేందుకు రూ. 100 కోట్లు అప్పటికప్పుడే కేటాయించారన్నారు. ఇక జిల్లా రైతుల సమస్యలు పరిష్కరించేందుకు హంద్రీనీవాను తీసుకొచ్చి రూ. 600 కోట్లతో 80 శాతం పనులను పూర్తి చేశారన్నారు. ఆయన మరుణానంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేవలం 20 శాతం పనులు పూర్తి చేయకపోగా పిల్లకాలువలు సైతం నిర్మించిన పాపానపోలేదన్నారు. చంద్రబాబు జిల్లాకు సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్‌కు అనుబంధం, ఫుట్ పార్క్, ఈపార్క్, ఆపార్క్ అని చెప్పారే కానీ ఇంతవరకు అమలుచేయలేదన్నారు. ప్రజలు తమను ఆశీర్వదించి అధికారమిస్తే మెరుగైన వైద్య సౌకర్యం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి, హిందూపురం ఇన్‌చార్జి శంకర్ నారాయణ, మాజీ మంత్రి షాకీర్, కదిరి నియోజకవర్గ సమన్వయకర్త పీవీ సిద్దారెడ్డి, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్, అనంతపురం సమన్వయకర్త నదీం అహ్మద్, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ లింగాల శివశంకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి, పుట్టపర్తి ఇన్‌చార్జ్ దుద్దుకుంట శ్రీ్ధర్ రెడ్డి, నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి, బత్తల హరిప్రసాద్, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రహిమాన్, పూల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాట నిలబెట్టుకున్న చంద్రబాబు
* బీసీల్లోకి బలిజలు, కాపులు..: మంత్రి గంటా
తలుపుల, డిసెంబర్ 23: ఎన్నికల సందర్భంగా బలిజలకు ఇచ్చిన మా టను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకున్నారని రాష్ట్ర మానవనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో విజయనగర సామ్రాజ్య నేత శ్రీకృష్ణదేవరాయుల కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బలిజలను బీసీ జాబితాలో చేర్చుతూ అసెంబ్లీలో తీర్మాణం చేయడం జరిగిందని, బలిజలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ప్రభు త్వం ముందుకెళ్తోందన్నారు. బలిజలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించినందు వల్ల మిగిలిన బీసీ విద్యార్థుల మాదిరి కాపుల విద్యార్థులకు ప్రభు త్వం నుండి అన్ని సహాయాలు అందుతాయన్నారు. ఇప్పటికే కాపు ఫెడరేషన్ ఏర్పాటు చేసి కాపు బలిజలకు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు బ్యాంకుల ద్వారా ఆర్థికసాయం అందివ్వడం జరిగిందన్నారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం వల్ల పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని, ఇంటర్మీడియట్ నుండి ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ వరకు స్కాలర్‌షిప్‌లు అందుతాయని చెప్పారు. చారిత్రక పురుషుడైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఇక మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెడుతున్నామని, అలా గే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం సైతం వచ్చే విద్యా సంవత్సరం నుండి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. డీఎస్సీ ద్వారా 14 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నామని చెప్పారు. అలాగే పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణదేవరాయులు విజయనగర సామ్రాజ్యంలో నీటి వనరులకు ఎంతో కృషి చేశారని, ప్రపంచంలో ఇలాంటి రాజు వుండరని, ఆయన నిర్మించిన చెరువులు, కుంటల వల్ల రైతాంగం సుఖసంతోషాలతో జీవిస్తున్నారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు నీటి వనరులు, చెరువుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ కృష్ణదేవరాయుల విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఆనందదాయకంగా వుందని, హంద్రీనీవా, పోలవరం ప్రాజెక్ట్‌లను చేపట్టిన ముఖ్యమంత్రి రైతులకు ఎంతో సేవలు చేస్తున్నారన్నారు. కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ నీతి, నిజాయితీ పాలనకు శ్రీకృష్ణదేవరాయులే నిదర్శనమన్నారు. ప్రజాభిమానం పొందే పాలకులు ఎన్ని కాలాలైనా ప్రజలు గుండెల్లో వుంచుకుంటారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా పాలన సాగిస్తున్నారన్నారు. ప్రజల్లో గౌరవాన్ని మరిచిన వారిని చరిత్ర క్షమించదన్నారు. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా మాట్లాడుతూ రాయల పాలన అందరికీ మార్గదర్శకమన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ తిరుమల వెంకన్నకు శ్రీకృష్ణదేవరాయులు వేల వరహాలు ముడుపులుగా చెల్లించుకున్నారని, ఆయన పాలనలో ఏడుసార్లు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు శాసనాలు చెబుతున్నాయన్నారు. అలాంటి పాలకుడిని స్మరించుకోవడం ఆనందదాయకమన్నారు. పెనుకొండ ఎమ్మెల్యే బీకే పార్థసారథి మాట్లాడుతూ కృష్ణదేవరాయల పాలన వల్లే ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతంగా పిలవబడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు నారాయణస్వామి, జిల్లా కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మురళీ, రాష్ట్ర మాంసాహార ఉత్పత్తుల ఛైర్మన్ ప్రకాష్ నాయుడు, కదిరి మార్కెట్ యార్డు ఛైర్మన్ రామక్రిష్ణారెడ్డి, ఆర్‌జేడీ ప్రతాప్‌రెడ్డి, డీఈఓ జనార్థనాచార్యులు, పెనుకొండ డీఎస్పీ కరిముల్లా షరీఫ్, కదిరి రూరల్ సీఐ మన్సూరుద్దీన్, నల్లమాడ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డితోపాటు వేలాది మంది కాపు, బలిజలు పాల్గొన్నారు.

బూత్ కమిటీ సభ్యులే విజయ సారథులు
* బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురంధ్రేశ్వరి
గోరంట్ల, డిసెంబర్ 23 : బూత్ కమిటీ సభ్యులే బీజేపీ విజయసారథులని ఆపార్టీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధ్రేశ్వరి అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన పెనుకొండ నియోజకవర్గ బూత్ కమిటీల కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడుతూ ప్రసార మాధ్యమాలు రాష్ట్ర బీజేపీపై సీత కన్ను వేశాయన్నారు. కావున కార్యకర్తలే ప్రసార మాధ్యమాలుగా మారి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పేదలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్రమోదీ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందిస్తున్నారన్నారు. పేదల అభ్యున్నతితోపాటు ఆత్మ గౌరవాన్ని నిలుపుతున్నామన్నారు. గతంలో ఏ ప్రధాని చేపట్టని పథకాలతోపాటు సాహసోపేతమైన నిర్ణయాలతో నీతివంతమైన పాలన అందిస్తున్న ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఇక రాష్ట్భ్రావృద్ధికి కేంద్రం చిత్తశుద్ధి, అంకితభావంతో సహకరిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా ఉండదని, సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. బీసీలకు అండగా నిలుస్తామన్నారు. అయితే బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డుతగులుతోందని ఆరోపించారు. ముస్లిం మహిళలకు శాపంగా ఉంటున్న ట్రిపుల్ తలాఖ్ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు హాస్యాస్పదమంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా స్థానంలో అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు ఒనగూరే విధంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి చట్టబద్ధత కల్పించామన్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి మూడేళ్లలో రూ.1050 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కలల ప్రపంచంలో విహరిస్తోందన్నారు. కాంగ్రెస్ కుటుంబ పార్టీగా పరాజయాల బాట పడుతోందన్నారు. దేశంలో 13 కోట్ల మంది సభ్యులు ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో 40 లక్షల సభ్యత్వాలు సేకరించిందన్నారు. 2019 ఎన్నికల్లో ఎపీలో సత్తా చాటబోతోందన్నారు. హిందూపురం పార్లమెంటు స్థానంతోపాటు పెనుకొండ అసెంబ్లీ స్థానంలో జయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా సమావేశంలో జరుగుతున్న సమయంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జెండాలు చేతబట్టి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని నినాదాలు చేస్తూ వచ్చి పురంధేశ్వరికి వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీఎం శేఖర్, కార్యదర్శి రవీంద్రరాజు, మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారధి, జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి, స్థానిక నాయకులు మధుసూదన్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, రామప్పతోపాటు పరిగి, సోమందేపల్లి, రొద్దం, పెనుకొండ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పురంధ్రేశ్వరి రావాలి..
* నాయకుల నినాదాలు
హిందూపురం, డిసెంబర్ 23: రానున్న ఎన్నికల్లో బీజేపీ జాతీయ మహిళా మోర్చ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హిందూపురం పార్లమెంట్ నుంచి నుంచి పోటీ చే యాలని పార్టీ నాయకులు, కార్య కర్తలు నినాదాలు చేశారు. గోరంట్లలో శనివారం జరిగిన నియోజకవర్గ స్థాయి పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హా జరైన ఆమెకు అనుకూలంగా నినా దాలు చేయడంతో ఎవరూ వారించ కపోవడం చర్చనీయాంశమైంది. దీనికితోడు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తన ప్రసంగంలో సైతం బీజేపీ బలంపై వ్యా ఖ్యలు చేయడం మరింత బలాన్ని చేకూరుస్తోంది. రాష్ట్రంలో ఊహించని రీతిలో బీజేపీ సత్తా చాటుతోం దని హర్షధ్వానాల నడుమ పేర్కొనడాన్ని బట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు అనుసరిస్తున్న వ్యూహాలు చెప్పకనే తేటతెల్లమవుతున్నాయి. పురందేశ్వరి తండ్రి, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హిందూపురం అసెంబ్లీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా నందమూరి హరికృష్ణ ఒకసారి ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్టీఆర్ కూతురుగా పురంధ్రేశ్వరిని పార్టీలకతీతంగా ఆదరిస్తారన్న నమ్మకం బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. దీన్నిదృష్టిలో ఉంచుకుని పురంధ్రేశ్వరిని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి బరిలో దించాలని వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.