కడప

చట్టాలపై అవగాహన ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట,డిసెంబర్ 23: న్యాయస్థానాల్లో క్రిమినల్ కేసులు, నేరవిచారణ, బెయిల్ మంజూరులలో నూతన న్యాయవిధానాలు, చట్టాలపై తప్పనిసరి అవగాహన వుండాలని జిల్లా పోర్టుపోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సునీల్‌చౌదరి న్యాయాధికారులకు సూచించారు. శనివారం ఉదయం స్థానిక జిల్లాకోర్టు ఆవరణలోని సమావేశ హాల్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లాలోని న్యాయాధికారులకు నూతన న్యాయవిధానాలు, చట్టాలపై ఒకరోజు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పోర్టుపోలియో జడ్జితోపాటు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి.యతిరాజులు, జస్టిస్ శేషశయనారెడ్డిలు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యఅతిధులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయాధికారులు కోర్టులో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతిప్రజ్వలనతో ముఖ్యఅతిధులు సదస్సును ప్రారంభించారు. సదస్సునుద్దేశించి జస్టీస్ సునీల్ చౌదరి మాట్లాడుతూ కేసుల విచారణలో న్యాయస్థాన పరిధి నిర్వహించాల్సిన పాత్ర కేసుల ఔచిత్యాలపై, న్యాయచట్టాలు, విధానాలపై న్యాయాధికారులు విస్తత్ర అవగాహన కలిగివుండాలని అందుకు సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. నేటి అవగాహన సదస్సులో తెలియజేసే అంశాలపై అవగాహన పెంచుకుని సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్యాప్తు విధానంలో ‘కోర్టుల పాత్ర-పరిధి’161,164 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద నమోదుచేసిన ప్రకటనల ఔచిత్యం, విచారణ సమయంలో పరీక్ష, కస్టడి , గుర్తింపు పరేడ్‌లు ఆస్తిస్వాధీనం, మరణించిన ప్రకటనల రికార్డింగ్, న్యాయకస్టడీ, పోలీసు కస్టడీలో ఇటీవల పోకడలు, బెయిల్, ముందస్తు బెయిల్, తప్పనిసరి బెయిల్, దోషనిర్థారణ, తర్వాత బెయిల్, వివిధ క్రిమినల్ పిటీషన్లు, న్యాయ పరిపాలనను ప్రభావితం చేసే నేరాలు తదితర అంశాలలో న్యాయాధికారులకు అవగాహన కల్గించారు. ఈ కార్యక్రమంలో కడప ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి సిఎన్ మూర్తి, కడప, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట సీనియర్ సివిల్ జడ్జిలు మనోహర్‌రెడ్డి, షేక్ సికింధర్‌బాషా, శ్రీనివాసరావు, అడిషనల్ జ్యుడిషయల్ జడ్జి చల్లాజానకి, జిల్లాలోని న్యాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

తలనీలాల వేలం వాయిదా..

చక్రాయపేట, డిసెంబర్ 23: జిల్లాలో ప్రసిద్ధిచెందిన శ్రీ గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో ఏడాది కాలం పాటు తలనీలాల సేకరణకు నిర్వహించిన వేలం పాటలో వ్యాపారులు సిండికేట్ ఏర్పడి వారి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో అధికారులు తలనీలాల వేలం పాటను వాయిదా వేసినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ తెలిపారు. శనివారం గండి క్షేత్రంలోని దేవస్థాన కార్యాలయంలో తలనీలాల వేలం పాటలో సుబ్బరాయుడు, కె.రాజు, కెవి వీరభాస్కర్, దాసులు వీరు నలుగురు ఒక్కొక్కరు రూ.20 వేలు చొప్పున నగదు, డీడీలను చెల్లించి వేలంపాటలో పాల్గొన్నారు. దేవస్థానం వారు రూ.50 లక్షలతో వేలం పాట ప్రారంభించగా చివరకు రూ.56.50 లక్షలు కె.రాజు హెచ్చుపాటదారుడిగా నిలిచిపోవడంతో అందుకు దేవస్థానం వారు గత సంవత్సరం రూ.65 లక్షలు టెండర్లు జరిగాయని ఈ యేడాది కనీసం రూ.60 లక్షలకు తగ్గకుండా ఉంటే చేస్తామని, లేదంటే వేలం పాట రద్దు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ సహాయ కమిషనర్ కార్యాలయం నుండి జూనియర్ అసిస్టెంట్ భారతి, దేవస్థాన ఛైర్మన్ వడ్లకుంట రాజారావు, పాలకమండలి సభ్యులు సుబ్బరాయుడు, పసుపులేటి బాబు,సిబ్బంది, తలనీలాల వ్యాపారస్థులు పాల్గొన్నారు.