రంగారెడ్డి

బస్తీల బాగుతోనే బంగారు తెలంగాణ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, డిసెంబర్ 24: బంగారు తెలంగాణ అంటే సుందరమైన ప్రగతిభవన్, సినిమా నటులు ఉండే ప్రాంతాలు కావని, బస్తీలు బాగుపడినప్పుడే అసలైన బంగారు తెలంగాణ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్తీబాటలో భాగంగా ఆదివారం సాయంత్రం హస్తినాపురం డివిజన్ నందనవనం కాలనీలో పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై కొట్లాట సభలో మురళీధర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం.. మీడియాలో చూపించే ప్రచారాలకు బస్తిలలో ఉండే సమస్యలకు పొంతన లేకుండా ఉందని అన్నారు. హైదరాబాద్ నగరంలో 1500బస్తీలు ఉన్నాయని బస్తిలలో ఉండే ప్రజల జీవితాలను చూడాలని ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. నందనవనం, భూపేష్‌గుప్తనగర్, ఇంద్రసేనారెడ్డినగర్ బస్తిలలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికార ప్రజాప్రతినిధులు పేదలను భయబ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్ మీటర్లు బిగించకుండా ఇంటికి సుమారు రూ.30వేలను వసూళ్లు చేస్తున్నారని అన్నారు. బస్తీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని దాంతో విషజ్వరాల భారీన పడుతున్నారని నందనవనంలో చికెన్‌గున్యాతో ఒకరు మృతిచెందారని తెలిపారు. బస్తిల దుస్థితి ఈ విధంగా ఉంటే ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. 90వేల ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.1.60లక్షలు మంజూరు చేశారని, కానీ తెలంగాణ ప్రభుత్వం 14వేల ఇళ్లు మాత్రమే నిర్మించిందని విమర్శించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు పక్కన పెడితే పేదలు నివాసం ఉండే ప్రాంతాలలో దౌర్జన్యంగా వారి ఇళ్లను కూల్చడంతో పాటు విద్యుత్ కనెక్షన్‌లను అక్రమంగా తొలగిస్తున్నారని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో బస్తీల్లో కౌంటర్‌లను ఏర్పాటు చేసి సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. ఉచిత కరెంట్ అంటూ ప్రచారాలు చేస్తున్న ముఖ్యమంత్రి.. ఒక్కసారి బస్తీలకు వచ్చి నేరుగా చూడాలని అన్నారు. ఇంటింటికీ తీసుకెళ్లి పేదల అవస్థలను చూపిస్తామని చెప్పారు. బస్తీలను బాగుచేయకపోతే ప్రజలు ఓట్లతో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విమోచన అధ్యక్షుడు బాలం ఈశ్వర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌జీ, జిల్లా అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, నాయకులు వంగ మధుసూధన్ రెడ్డి, స్వామి గౌడ్, సుభాష్ గౌడ్, బచ్చిగల్ల రమేష్, పురుషోత్తం పాల్గొన్నారు.