రంగారెడ్డి

రైతుల ఆదాయం రెట్టింపునకు ఉద్యాన ప్రాంతాల గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 24: ఉద్యాన రంగంతో రైతుల ఆదాయాల రెట్టింపు అవుతుందని, రాష్ట్రంలో ఉద్యాన పంటలకు భవిష్యత్తు ఉన్న మరిన్ని సాగు ప్రాంతాలను గుర్తించేందుకు ముమ్మర ప్రణాళికలు జరుగుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సీ.పార్థసారథి అన్నారు. భూ ప్రక్షాళనపై త్వరలోనే ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోని సబ్ కమిటీ మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించనుందని, ఉద్యాన విద్యార్థులకు పోస్టులలో ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. మెట్రో నగరం, జిల్లా కేంద్రాలలో కూరగాయాల కొరతను తీర్చేందుకు పంట కాలనీలను భారీగా ప్రమోట్ చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మూడవ ఆవిర్భావ దినోత్సవ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలోని మూడు గ్రామాలలో చేపట్టిన కూరగాయల పంట కాలనీలు అత్యంత సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. రాష్టమ్రంతా ఇదే తరహాలో పంట కాలనీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ‘కల్లు’నిచ్చే తాటి చెట్లపై పరిశోధనకు కేంద్రం నుంచి అఖిల భారత పరిశోధన సమన్వయ పథకం మంజూరు అయ్యిందని, దీనితో తాటిని వాణిజ్య తోటలుగా సాగు చేసేందుకు, ఉత్పాదకత పెంచేందుకు రాష్ట్రంలో పుష్కల అవకాశాలున్నాయని తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి పంటలపై సైతం ఏఐసీఆర్ ఐపీ పథకం మంజూరు కానుందని తెలిపారు. నూతన కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆదాయాల పెంపునకు ప్రణాళిక - 2014 పై ముమ్మర కసరత్తు చేస్తున్నామని అన్నారు. మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ఒప్పందంలో తెలంగాణలోని పంటలకు ‘విలువల జోడింపు’ చేపడుతున్నామని పేర్కొన్నారు. గిట్టుబాటు ధరలు దీనితో సాధ్యమని, క్షేత్ర స్థాయి అధికారి నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు ఇజ్రాయిల్‌లో శిక్షణ ఇప్పించి సాగును లాభాల బాట పట్టిస్తామన్నారు. ఇజ్రాయిల్ తరహాలో ‘నీటి మంత్రం’తో తక్కువ నీటితో ఎక్కువ ఉత్పాదకత ఈ శిక్షణ లక్ష్యమని వివరించారు. అర్హులైన రైతులందరికీ ఎకరానికి సీజన్‌కు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సహాయం కింద ఇచ్చి రైతులను వడ్డీ వ్యాపారస్తుల కోరల నుంచి తప్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. ఉద్యాన విశ్వవిద్యాలయంలో నూతనంగా శాస్తవ్రేత్తలను నియమిస్తామని చెప్పారు. రూ.3 కోట్లతో ఈ-లెర్నింగ్, పాఠాలు విద్యార్థులకు నేర్పుతామని అన్నారు. వైఫై ప్రాంగణాలుగా కళాశాలను తీర్చిదిద్దుతామని వివరించారు. తరగతుల వారిగా మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విశ్వవిద్యాలయం ఉద్యోగులందరికీ ఇన్‌స్టాగ్రాం ఐడీలతో కూడిన డాటాబేస్‌ను ఆవిష్కరించారు. టమాట, మిరప వంగడాల స్టాల్‌లను సందర్శించారు.
రిజిస్ట్రార్ డాక్టర్ వీ.రవీందర్ రెడ్డి, డీన్ ఆఫ్ హార్టికల్చర్ డాక్టర్ ఎం.విజయ, డాక్టర్ రావె చంద్రశేఖర్, డాక్టర్ వనజాలత, డాక్టర్ పద్మ, నర్సింహా రావు పాల్గొన్నారు.

అకుంటిత దీక్షతో చేపట్టిన పథకం మిషన్ భగీరథ
జీడిమెట్ల, డిసెంబర్ 24: ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంటిత దీక్షతో మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. బాచుపల్లి మండలం నిజాంపేట్ గ్రామం పార్వతీ విల్లాస్‌లలో మంచినీటి నల్లాలను, బండారి లేఔట్ కాలనీలో మంచినీటి పైపులైన్ పనులను వివేక్ ప్రారంభించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. మిషన్ భగీరథ పథకంతో తాగునీటి సమస్య తీరిపోతుందని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రమీల, నియోజకవర్గం తెరాస నేత కొలను శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు మేకల వెంకటేశం, చందు ముదిరాజ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వివేక్‌కు కృతజ్ఞతలు
తెలిపిన కార్మికులు
సూరారం నార్త్ సిటీ స్కూల్‌లో గండిమైసమ్మలోని ఫ్లెమింగ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ పరిశ్రమ కార్మికులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమ యాజమాన్యంతో వివేక్ కార్మికుల జీతాలను పెంచిన సందర్భంగా సన్మానించారు. వివేక్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారమే తన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రావు, వెంకట్‌రెడ్డి, రెడ్డప్ప, రాజాబాబు పాల్గొన్నారు.
దుర్గాఎస్టేట్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
జీడిమెట్ల డివిజన్ దుర్గా ఎస్టేట్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేక్ విచ్చేసి 2018 సంవత్సర నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వివేక్ మాట్లాడుతూ కాలనీలో కలిసికట్టుగా ఉంటే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో రాజగోపాల్, కేవీవీ సత్యనారాయణ, నరేశ్ పాల్గొన్నారు.