హైదరాబాద్

ప్రతిభను వెలికితీసేందుకు శ్రీమతి తెలంగాణ పోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 24: మహిళల్లోని ప్రతిభను వెలికితీసేందుకు కైరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీమతి తెలంగాణ పేరుతో పోటీలను నిర్వహించనున్నట్టు నిర్వాహకురాలు సంధ్యలక్ష్మీ తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, లక్ష్మీజగదీశ్వర్ ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలపై మహిళలపై అవగాహన కల్పించడంతో పాటు వివిధ రంగాల్లో వారు ఏ విధంగా రాణిస్తున్నారు అనే అంశాలపై పోటీలు ఉంటాయని చెప్పారు. 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు మహిళలు ఇందులో పాల్గొన వచ్చని తెలిపారు. మొదట రాష్టవ్య్రాప్తంగా అడిషన్స్‌ను నిర్వహించి వాటిల్లో గెలుపొందిన వారితో మార్చి 27న ఫైనల్ పోటీలు నిర్వహిస్తామని, అందులో విజయం సాధించిన వారిక బహుమతలు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వెంకటేవ్వర్ రెడ్డి, మేయర్ సతీమణి శ్రీదేవి పాల్గొన్నారు.

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకూ పోరాటం
ఖైరతాబాద్, డిసెంబర్ 24: లంబాడీ కులస్థులను షెడ్యూల్డ్ తెగల నుంచి తొలగించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందని ఆదివాసి సంక్షేమ పరిషత్ పేర్కొంది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పరిషత్ అధ్యక్షుడు పూనెం శ్రీనివాస్, ఆదివాసి విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు మైతం బాబు, ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్లూరి జయబాబు, ఆదివాసి ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడారు. లంబాడీలు మహారాష్టల్రో బీసీలుగా, కర్ణాటకలో ఎస్సీలుగా, రాజస్థాన్ ఓసీలుగా కొనసాగుతున్న వారిని తెలంగాణలో ఎస్టీలుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 342(1) ప్రకారం షెడ్యల్డ్ ట్రైబల్స్‌లో ఓ కులాన్ని కలపాలంటే గవర్నర్ ద్వారా పబ్లిక్ నోటిషికేషన్ జారీ చేసి రాష్టప్రతి ఆమోదం తెలపాల్సి ఉంటుందని, అవి ఏవి జరకుండానే లంబాడీలను తెలంగాణలో ఎస్టీ జాబితాలో కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఓ ప్రణాళిక ప్రకారం ఎస్టీ జాబితాలో చేరిన లంబాడీలు కోయ, గోండుతో పాటు ఆదివాసీ జాతులకు తీరని అన్యాయం చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీ జాబితాలో లబ్ధిపొందాల్సిన కులాలకు అన్యాయం చేస్తూ విద్యా, ఉద్యోగ, ఉపాది వారే పొందుతూ వచ్చారని ఆరోపించారు. ఓట్ల కోసం కొంత మంది రాజకీయ నేతలు లంబాడీలకు మద్దతు పలకడం సరికాదని అన్నారు. అన్యాయంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న వారిని గిరిజన తెగల జాబితా నుంచి తొలగించకపోతే కొమరం భీమ్ స్ఫూర్తితో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సోలెం సాగర్, సురేష్, జయవంత రావు, సతీష్, శ్రీనివాస్, భీమ్‌రావు పాల్గొన్నారు.