రంగారెడ్డి

సోనియమ్మ దయతో తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 24: బంగారు తెలంగాణ కావాలంటే కెసిఆర్ పాలనను అంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం బోడుప్పల్ పురపాలక సంఘం కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య మూడవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జెఏసి చైర్మన్ ఆచార్య కోదండరామ్, సమాఖ్య చైర్మన్ రాపోలు రాములు, అధ్యక్షుడు బొమ్మక్ రమేశ్‌తో కలిసి జ్యోతిని వెలిగించారు. తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంటు సభలో తాను మాడ్లాడితే స్పందించిన సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని అన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో, కళ్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం వాగ్ధానాలను విస్మరించి ప్రజల్ని మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాన్న కెసిఆర్ పదవీ వ్యామోహంతో గద్దెనెక్కి మహిళలు, దళితులు, గిరిజనులు, బలహీన, మైనార్టీ వర్గాలను మోసం చేస్తూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కుటుంబ పాలనగా ప్రభుత్వం తయారైందన్నారు. కుటుంబ పాలనగా తెలంగాణ వచ్చిందన్నారు. మంత్రి వర్గంలో మహిళలకు స్థానం కల్పించకుండా కుటుంబ పాలనతో ప్రజలు విసుగుచెందారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం లేకున్నా ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సమాఖ్య పని చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేసి రాబోయే కాలంలో ఆదర్శ పురపాలక సంఘంగా బోడుప్పల్‌ను తీర్చిదిద్దితే తన సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. బోడుప్పల్‌లో ప్రజలు రుజువు చేస్తున్నారని అభివర్ణించారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సైనికుడిలా ఉద్యమిస్తూ సమస్యలను అధికారులపై తీసుకొచ్చి పరిష్కరించుకోవడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఉద్యమాల ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి హక్కులను సాధించుకోవాలని తెలిపారు. సమాఖ్య చైర్మన్ రాపోలు రాములు, అధ్యక్షుడు బొమ్మక్ రమేశ్ మాట్లాడుతూ ఉద్యమాల ద్వారా కనీస అవసరాలు, వౌలిక వసతులను, మంచినీరు వంటి సాధించిన ఇతర విజయాలను వివరించారు. రమేశ్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ సభలో సమాఖ్య ప్రతినిధులు సామాజిక విశే్లషకురాలు దేవి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ, సిపిఐ కార్యదర్శి జే.లక్ష్మీ, ఐద్వా మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు సృజన, వర్కింగ్ ప్రెసిడెంట్ వీ.అశోక్ రెడ్డి, ప్రతినిధులు మధుసూదన్‌రెడ్డి, మల్లారెడ్డి, చిత్తరంజన్, ఎస్‌వీ శాస్ర్తీ, చిలుక భాస్కర్, మహిళా ప్రతినిధులు రాపోలు సువర్ణ, విజయలక్ష్మి, అనురాధ, మార్గరేట్, శశిరేఖ, విమల, సుగుణ, సంధ్య, విజయారెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాలనీల నుంచి సుమారు వెయ్యి మంది మహిళలు పాల్గొనడంతో వార్షికోత్సవ సభ విజయవంతమైంది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. టైలరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులలో ప్రతిభ కనబరిచిన విజేతలకు రాపోలు సందీప్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు.