నల్గొండ

రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 26: రైతు సమస్యల పరిష్కారంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందునే రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని సీపీఎం శాసన సభ పక్ష మాజీ నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో రాష్ట్రంలో గత మూడున్నర ఏళ్లలో 4వేల మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 435 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభ పరిష్కారానికి కెసిఆర్ ప్రభుత్వ నిర్ధిష్ట చర్యలు చేపట్టకుండా కేవలం రాజరికపు, నియంత పాలన విధానాలతో ప్రజాధనం దుబారా చేస్తుందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న 435 కుటుంబాల్లో ఇప్పటిదాకా కేవలం 150 కుటుంబాలకు అరకొర ఆర్థిక సహాయం అందించారని ప్రభుత్వం ప్రకటించిన రీతిలో అందరికి ఆరులక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. పంట రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీ, మద్దతు ధర సమస్యల పరిష్కారంలో సరైన చర్యలు లేకుండా రైతు వ్యతిరేక పాలన విధానాలు అనుసరిస్తుండటంతోనే రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. భూనిర్వాసితులు న్యాయమైన పరిహారం కోరితే వారిపై కూడా అణిచివేతకు పాల్పడుతుందన్నారు. నిరుద్యోగులు, టీ.జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఉద్యోగాల భర్తీని కోరి ఆందోళన చేపడితే వారిని సైతం అరెస్టు చేసిందన్నారు. చివరకు ఏళ్ల తరబడిగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఉద్యమిస్తున్న ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణను సైతం అరెస్టు చేసి జైలులో నిర్బంధించి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందన్నారు. ఉద్యమాల పార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజా ఉద్యమాలపై అణిచివేతకు పాల్పడుతు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల హామీల్లో డబుల్ బెడ్‌రూమ్, మూడెకరాల భూపంపిణీ, కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం వంటి అనేక హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల హామీల అమలుకు ఉద్యమించిన వారిపై అణిచివేతకు పూనుకుంటుందన్నారు. నల్లగొండ జిల్లాలో సైతం కుర్చీవేసుకుని ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయిస్తానని చెప్పిన కేసీఆర్ నేటికి అందుకు చర్యలు తీసుకోలేదన్నారు. డిండి ఎత్తిపోతల, మూసీ కాల్వల నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వకుండా బలవంతపు భూసేకరణతో వివాదాలు రేపుతు రైతులపై కేసులు పెడుతు ప్రాజెక్టులు కట్టకపోగా ప్రతిపక్షాలపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందన్నారు. మాడ్గులపల్లి వరకు వచ్చిన వరదకాలువను సైతం పూర్తి చేయలేదన్నారు. కేంద్రం ఉపాధిహామీ పథకం నిర్వీర్యం చేస్తు 11కోట్ల బకాయిలు కూలీలకు చెల్లించకుండా నెలల తరబడిగా జాప్యం చేస్తు రోజుకూలీపై బతికే కూలీలను బాధపెడుతుందన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలు చేయాలని సిపిఎం ప్రజాపక్ష పోరాటాలు ఉద్ధృతం చేస్తుందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, డి.మల్లేశం, మామిడి సర్వయ్య, పి.నాగార్జున, కందాల ప్రమీల, కె.నాగిరెడ్డి ఉన్నారు.