నిజామాబాద్

పింఛన్ దారుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ రూరల్, డిసెంబర్ 26: పింఛన్ పైకం ఇవ్వడం లేదంటూ లబ్ధిదారులు సోమవారం బాన్సువాడలో రోడ్డెక్కి రాస్తారోకో చేపట్టారు. గంటల తరబడి వేచి యుంటున్న చేతికి ఆసరా డబ్బులు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి కొంతమంది వృద్ధులు పోస్ట్ఫాసులోనే బైఠాయించి తమ నిరసనను చాటారు. కోటి ఇరవై లక్షలు అవసరముండగా కేవలం ఇరువై లక్షల రూపాయలు మాత్రమే మంజూరు కావడంతో అధికారులు పింఛన్ డబ్బులను అందించేందుకు చేతులెత్తేశారు. ఈ విషయంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు పింఛన్ పైకం అందించే వరకు వెనుదిరిగేది లేదంటూ పట్టుబట్టారు. వికలాంగుల పెద్ద సంఖ్యలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని రాస్తారోకో జరిపారు. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గంగధర్ ఆద్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పించన్ డబ్బులు అడిగితే తమను చీదరింపులు, చిత్కారాలకు గురి చేస్తున్నారని, వికలాంగులమన్న మానవత్వం లేకుండా గంటల తరబడి క్యూలో నిలబెడుతూ శారీరక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెల 5వ తారీఖులోగా పింఛన్ డబ్బులను అందించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వికలాంగుల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని, వికలాంగులను క్యూలో నిలబెట్టకుండా వెంటనే పింఛన్ పైకం అందించాలంటూ తమ గళాన్ని వినిపించారు. గంట పాటు రాస్తారోకోతో పట్టణ ప్రధాన రహదారికిరువైపుల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. పోలీసుల రంగ ప్రవేశం చేసి రాస్తారోకోను విరమింప జేశారు.