మహబూబ్‌నగర్

కులవృత్తులను ప్రొత్సహించింది.. టీఆర్‌ఎస్ ప్రభుత్వమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, డిసెంబర్ 26: గతంలో ఎన్నడులేని విధంగా కులవృత్తులను ప్రొత్సహించాలనే దృఢసంకల్పంతో కులవృత్తులపై ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తూ వారిపై ప్రత్యేక శ్రద్ధవహించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంలోనిదేనని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం కోస్గిలో జాండ్ర కురిహిణిశెట్టి సమాజానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వం తరపున పాలిటెక్నిక్ కళాశాలను నూతనంగా ఏర్పాటు చేస్తున్న డి ఎస్సీ కోచింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందని ఇందులో భాగంగానే టీఆర్‌టి నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని త్వరలో వైద్య ఆరోగ్యశాఖలో సైతం 18వేల పోస్టులు భర్తీ కానున్నాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. నేడు ప్రారంభించిన కోచింగ్ సెంటర్ ద్వారా కోచింగ్ తీసుకున్న 50శాతం మంది అభ్యర్థులు టీఆర్‌టీకి ఎంపికవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన అధ్యాపకులను తీసుకువచ్చి ఇక్కడ కోచింగ్ ఇప్పిస్తున్నామని ఈ అవకాశాన్ని కొడంగల్ నియోజకవర్గ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ప్రభుత్వాల కారణం వల్ల నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులను ప్రొత్సహిస్తుందని అందులో భాగంగానే కురిహిణిశెట్టి జాండ్రసమాజానికి కమ్యూనిటీ హల్ భవన నిర్మాణానికి రూ.10లక్షలను మంజూరు చేస్తున్న ఆయన తెలిపారు. చేనేతకు దూరమైన ఈ ప్రాంత ప్రజలను గుర్తించి కొడంగల్ నియోజకవర్గంలో వృత్తిని ప్రొత్సహించేందుకు చేనేత మగ్గాలకు సంబంధించిన చిన్నతరహా పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సంబంధిత మంత్రితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో కనివిని ఎరుగని రితీలో కొడంగల్ నియోజకరవ్గం అభివృద్ధి చెందనుందని ఇందులో భాగంగానే బీటీరోడ్లు, ప్రభుత్వ భవనాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని త్వరలో నియోజకవర్గానికి 10సబ్‌స్టేషన్లు మంజూరు కానున్నాయని వాటికి త్వరలో టెండర్లు సైతం మంజూరు చేయబోతున్నామని అన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష 20వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని దినిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్రపన్నుతున్నారని ప్రజలపై ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న కేసులను వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. 69 జిఓ ద్వారా నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే ఆ జిఓ గతంలో ఎన్నికల సమయంలో హడావిడిగా తెచ్చిన జిఓ కాబట్టి ఓ ప్రణాళికబద్దంగా లేనందున ఆమలు చేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, జడ్పీ మాజీవైస్ చైర్మన్ కృష్ణ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు హన్మకిష్టప్ప, ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ బాలరాజు, వైస్ ఎంపీపీ దోమరాజేశ్వర్, ఇతర నాయకులు ఉన్నారు.
అంతర్ జిల్ల్లా దొంగ అరెస్టు
* మరొకరి కోసం వేట * హైదరాబాద్‌లో దొంగతనాలు...పాలమూరులో
అమ్మకాలు * 17 హోండా అక్టివా మోటార్‌సైకిళ్ల స్వాధీనం * నిందితుడు హైదరాబాద్ మీర్‌అల్‌మండి వాసి * జిల్లా ఎస్పీ అనురాధ

మహబూబ్‌నగర్, డిసెంబర్ 26: అంతర్ జిల్లా దొంగల ముఠాను మహబూబ్‌నగర్ పోలీసులు గుర్తించి ఎట్టకేలకు ముఠాలోని ఓ దొంగను పట్టుకుని ఆరెస్టు చేసి కటకటలకు పంపించారు. మరో దొంగ కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పోలీసులకు పట్టుబడ్డ అంతర్ జిల్లా దొంగల ముఠా సభ్యుడు మీర్ షబ్బీర్ అలీని మీడియా ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదిన సాయంత్రం 6గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్సై ఖాజాఖాన్ ఆధ్వర్యంలో ఏనుగొండ గ్రామం దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు హోండా ఆక్టివ్ మోటర్ సైకిల్‌పై అనుమానస్పదంగా వచ్చారు. ఇంతలోపే పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా ఒకరు దొరికారని మరోకరు పరారు అయ్యారని తెలిపారు. పోలీసులకు పట్టుబడ్డ మీర్ షబ్బీర్ అలీని విచారించడం జరిగిందన్నారు. విచారణలో దొంగతనాల విషయం వెల్లడైందని పెర్కోన్నారు. మీర్‌షబ్బీర్ అలీ హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంత పరిధిలో గల మీర్‌అల్‌మండి వాసిగా గుర్తించడం జరిగిందన్నారు. విచారించగా మీర్ షబ్బీర్ అలీ, ఫజల్ అనే ఇద్దరు కలిసి హైదరాబాద్‌లోని చంద్రయాన్‌గుట్ట, చాదర్‌ఘాట్, భవానీనగర్, పహాడిషరీఫ్, సంతోష్‌నగర్, బాలాపూర్, ఫలక్‌నుమా, లంగర్‌హౌజ్, కాచీగూడ, బహదూర్‌పూరలలో దాదాపు 15 మోటర్‌సైకిళ్లు దొంగతనం చేశారని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో రెండు మోటర్‌సైకిళ్లను దొంగతనం చేశారన్నారు. వీటన్నింటిని పాలమూరులోనే అమ్మడానికి సిద్దం చేశారన్నారు. సిద్ధం చేయడమే కాకుండా 17 ద్విచక్రవాహానాలను రూ.10.20లక్షలకు అమ్మకం పెట్టి ఒక్కో మోటార్‌సైకిల్‌కు అడ్వాన్స్‌గా రూ.25వేలు తీసుకున్నారని ఎస్పీ వెల్లడించారు. మీర్ షబ్బీర్ అలీ గతంలో చైన్‌స్నాచర్ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడని తెలిపారు. కేవలం ఈ దొంగల ముఠా హోండా ఆక్టివ్ మోటార్ సైకిళ్లను మాత్రమే దొంగతనాలు చేస్తున్నారని, అయితే మీర్ షబ్బీర్ అలీ, ఫజల్‌లు మహబూబ్‌నగర్‌లోని సద్దలగుండు వాసి అయిన నదిమ్ ఇంటి ఆవరణలో ఈ 17మోటర్ సైకిళ్లను ఉంచారని తెలిపారు. మీర్ షబ్బీర్ అలీ కేవలం ఈ వాహనాలే దొంగిలించడం జరిగిందని గతంలో మణికొండ ఫైనాన్స్‌లో పనిచేసేవాడని అయితే ఆ ఫైనాన్స్ కేవలం హోండా ఆక్టివ్ మోటర్‌సైకిళ్లకు మాత్రమే రుణాలు ఇచ్చేదని డబ్బులు చెల్లించని వారి దగ్గర షబ్బీర్ అలీ మోటర్ సైకిళ్లను రికవరీ చేసేవారని ఆ అనుభవంతోనే కేవలం ఇవే మోటర్ సైకిళ్లను దొంగతనం చేసి మహబూబ్‌నగర్‌లో అమ్మకాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో అడిషనల్ ఎస్సీ వెంకటేశ్వర్లు, డిఎస్పీ భాస్కర్, మహబూబ్‌నగర్ రూరల్ సిఐ పార్థసారథి, ఎస్సైలు రాఘవేందర్, ఖాజాఖాన్, పోలీస్ పిఆర్‌ఓ రంగినేని మన్మోహన్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.