మెదక్

ఎమ్మెల్యే గూడెం పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, డిసెంబరు 26: పటన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మారుతీనగర్ కాలనీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి కాలనీవాసులకు హామీ ఇచ్చారు. కాలనీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి అమీన్‌పూర్ పంచాయతీలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు మంగళవారం మారుతినగర్‌లో వారితో కలిసి పాదయాత్ర చేసిన ఎమ్మెల్యే పలు సమస్యలను గుర్తించారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో గ్రామ పంచాయతీ అధికారులను వెంటనే బాగు చేయాలని ఆదేశించారు. వేలాది మంది నివసిస్తున్న మారుతినగర్‌లో ప్రజలు రాకపోకలు సాగించడానికి సరైన రహదారి వ్యవస్థ ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే మిహీపాల్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి సిసి రోడ్లు వేయించడం జరుగుతుందని వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని సైతం అత్యాధునికంగా తీర్చిదిద్దడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. కాలనీలోని మురుగు నీరు సాఫీగా బయటికి పోవడానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలంలోను కాలనీవాసులు ఎలాంటి ఇబ్బందులూ పడకుండా నీరు నిలువకుండా చేయడానికి ఇప్పటి నుంచే అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేయాలని గ్రామ పంచాయతీ అధికారులు, మండల స్థాయి ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు ఎమ్మెల్యే గూడెం మహీపాల్‌రెడ్డి సూచించారు. ప్రజలు నిత్యం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి అధికారులు అనుక్షణం పర్యవేక్షణ జరపాలని అన్నారు. వారి సంక్షేమానికే ప్రతి అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. టిఆర్‌ఎస్ నాయకులు, మారుతినగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గ్గొన్నారు.

అధికారుల్లో మార్పు కోసమే
ఆకస్మిక తనిఖీలు: జేసీ

గజ్వేల్, డిసెంబర్ 26: రైతుల ఇబ్బందులను తొలగించే క్రమంలో ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ పేర్కొన్నారు. మంగళవారం వర్గల్, గజ్వేల్ లలో అధికారులు చేపట్టిన భూప్రక్షాళన పనితీరు, నిర్వహణ, రికార్డులను తనిఖీ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. మాన్యువల్ పహాణీలు, 1బీలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తూ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా అధికారుల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెల్తుండగా, రైతులకు అవసరమయ్యే వివరాలు క్షణాల్లో అందించడమే సర్కార్ లక్ష్యమని తెలిపారు. అలాగే వచ్చే నెలాకరులోగా కస్టమ్ మిల్లింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని రైస్‌మిల్లర్ లను ఆదేశించగా, ఇప్పటికే 17వేల టన్నుల బియ్యం అందజేసినట్లు తెలిపారు. అయితే దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 93వేల 962 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్‌లకు ఇవ్వగా, 75వేల 170 క్వింటాళ్ల కస్టమ్ మిల్లింగ్ రావాల్సి ఉందని చెప్పారు.
అలాగే 4520 టన్నుల సన్నబియ్యం మిల్లర్‌ల నుంచి రావాల్సి ఉండగా, 1917 టన్నుల బియ్యం అందించినట్లు చెప్పారు. ముఖ్యంగా రేషన్‌షాప్‌ల ద్వారా సరఫరా అవుతున్న బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే ఎంతమాత్రం సహించేదిలేదని, రేషన్ బియ్యం విక్రయించినా, కొనుగోలు చేసినా కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమాలలో ఆర్డీఓ విజేందర్‌రెడ్డి, తహశీల్దార్‌లు రవీందర్‌రెడ్డి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.