మెదక్

సత్తాచాటిన సంగారెడ్డి జిల్లా యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, డిసెంబర్ 26: ఈనెల 22నుండి 24వరకు హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. ఈ పోటీల్లో మూడు బంగారు, మూడు వెండి పథకాలను సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. ఈ చాంపియన్ షిప్‌లో బంగారు, వెండి పథకాలు సాధించడం సంతోషకరమని, భవిష్యత్తులో మరింత మంచి నైపుణ్యాన్ని కనబర్చి జిల్లాకు మంచి గుర్తింపుతీసుకరావాలని సూచించారు. యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాల్ మాట్లాడుతూ యువతకు చదువుతో పాటు క్రీడలు కూడ ముఖ్యమేనన్నారు. తల్లిదండ్రుల ఆలోచన విధానాల్లో మార్పులు రావాలని, పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని కోరారు. కరాటే పోటీల్లో పథకాలు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. పథకాలు సాధించిన వారిలో ఎండి.సద్దాం, డి.అంజలి, ఎండి.అజీమోద్దీన్, అజాస్, ప్రసన్నకుమార్, బుష్‌రా, నర్సింగ్, సయ్యద్‌లు ఉన్నారు. కరాటే మాస్టర్ సాజీత్, అశోక్ తదితరులు ఉన్నారు.

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

అల్లాదుర్గం, డిసెంబర్ 26: అల్లాదుర్గం ఉమ్మడి మండలంలోని బిజిలీపూర్ గ్రామంలో సిద్ది వినాయక సంఘం వారు నిర్వహించిన తాలూకా కబడ్డీ క్రీడలలో గెలుపొందిన విజేతలకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహాచే బహుమతులను ప్రదానం చేయించారు. మంగళవారం పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాలూకా స్థాయి క్రీడల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మొదటి బహుమతి పొందిన అందోల్ మండలంలోని అన్నసాగర్ కబడ్డీ జట్టును ఆయన అభినందించి మొదటి బహుమతి అందజేశారు. రెండవ బహుమతిని బిజిలీపూర్ జట్టు గెలుచుకోగా వారికి రన్నర్ బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని. ఓడినవారు గెలిచిన వారిని స్పూర్తిగా తీసుకొని తిరిగి నిర్వహించే క్రీడల్లో రాణించే విధంగా కృషి చేయాలన్నారు. నాలుగు రోజుల పాటు బిజిలీపూర్ గ్రామంలో కబడ్డీ పోటీలు నిర్వహించిన సిద్ధి వినాయక సంఘంను ఆయన అభినందించారు. మారుమూల గ్రామాల్లో తాలూకా స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తాలూకా స్థాయి వివిధ కబడ్డీ జట్లు పాల్గొనగా చివరకు అన్నసాగర్ టీమ్, బిజిలీపూర్ టీమ్‌లు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందుకున్నాయి. రాబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని క్రీడల్లోనే కాకుండా చదువుల్లో కూడా రాణించాలని, వచ్చే పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఆయా పాఠశాలలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. క్రీడల్లో గెలుపొందిన అన్నసాగర్ జట్టుకు షీల్డ్‌తో పాటు 7500 నగదును ఆయన అందజేశారు. ఈ క్రీడలకు గ్రామస్తులు హాజరై తిలకించడం పట్ల ఆయన కొనియాడారు. అల్లాదుర్గం మండల కాంగ్రెస్ అధ్యక్షులు శేషారెడ్డి, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు బాలరాజు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.